Begin typing your search above and press return to search.

మ‌హేష్ దారిలోకే జ‌క్క‌న్న వ‌చ్చేసారా?

మ‌హేష్ వెకేష‌న్ల‌కు రాజ‌మౌళి ఏమాత్రం అడ్డు చెప్ప‌కుండా నువ్వు వ‌చ్చిన‌ప్పుడే షూటింగ్ చేసుకుందాం? అన్న‌ట్లే క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   5 May 2025 5:30 PM
మ‌హేష్ దారిలోకే జ‌క్క‌న్న వ‌చ్చేసారా?
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ దారిలోకే ద‌ర్శ‌క‌శిఖ‌రం జ‌క్క‌న్న వ‌చ్చేస్తున్నారా? మ‌హేష్ ట్యాలెంట్ తో త‌న‌వైపుకు తిప్పుకున్నాడా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. రాజ‌మౌళి ఓ సినిమా మొద‌లు పెట్టాడంటే? హీరోలంతా అత‌డికి బాండ్ అయి ప‌నిచేయాలి. రెండేళ్ల పాటు ఎటూ క‌ద‌ల‌డానికి వీలుండ‌దు. వెకేష న్లు..ఫ్యామిలీతో ట్రిప్పులు అంటే ఒప్పుకోరు. అవ‌స‌ర‌మైతే ఫ్యామిలీస్ ని సెట్స్ కు తీసుకొచ్చి మాట మంతి జ‌ర‌ప‌మంటారు? త‌ప్ప వ్య‌క్తిగ‌త వెకేష‌న్ల‌కు ఇంత‌వ‌ర‌కూ ఏ హీరోకు టైమ్ ఇవ్వ‌లేదు.

ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, రానా, ఎన్టీఆర్ ఈ న‌లుగురు జ‌క్క‌న్న‌తో త‌మ ఎక్స్ పీరియ‌న్స్ పంచుకున్న సంద‌ర్భంలో ఈ విష‌యం బ‌య‌ట ప‌డింది. జ‌క్క‌న్న మాటే శాస‌నంగా ఈ హీరోలంతా అత‌డితో క‌లిసి ప్రయాణం చేసారు. కానీ మ‌హేష్ మాత్రం ఆన‌లుగురికి మిన‌హాయింపు. రాజ‌మౌళి సినిమా మొద‌లు పెట్టినా? మ‌హేష్ ఎంచ‌క్కా ఫ్యామిలీతో క‌లిసి ఎప్పుడు కావాల‌నుకుంటే అప్పుడు ప్టైల్ ఎక్కేస్తున్నాడు.

ఎస్ ఎస్ ఎంబీ 29 మొద‌లైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ రెండుసార్లు వెకేష‌న్ల‌కు వెళ్లొచ్చారు. తాజాగా మ‌రోసారి పాస్ పోర్ట్ చూపిస్తూ మ‌ళ్లీ చెక్కేస్తున్నాను హింట్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే రాజ‌మౌళినే మ‌హేష్ దారిలోకి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌హేష్ వెకేష‌న్ల‌కు రాజ‌మౌళి ఏమాత్రం అడ్డు చెప్ప‌కుండా నువ్వు వ‌చ్చిన‌ప్పుడే షూటింగ్ చేసుకుందాం? అన్న‌ట్లే క‌నిపిస్తుంది.

ఇప్ప‌టికే రెండు షెడ్యూళ్లు పూర్త‌య్యాయి. మ‌ళ్లీ కొత్త షెడ్యూల్ జూన్ 10న మొద‌ల‌వుతుంది. అంత వ‌ర‌కూ టీమ్ అంతా ఖాళీగా ఉండాల్సిందే. మ‌రి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్న‌ట్లు? తీవ్ర‌మైన ఎండ‌లు కార ణంగా విశ్రాంతి తీసుకుంట‌న్నారా? లేక మ‌రేదైనా కార‌ణం ఉందా? అన్న‌ది తెలియాలి. అవి ఎలా ఉన్నా మ‌హేష్ వెకేష‌న్ల‌కు మాత్రం ఎలాంటి ప్రోబ్ల‌మ్ లేదు సుమీ.