SSMB 29.. 2027 లో ఫిక్స్..?
రాజమౌళి మహేష్ కాంబో మూవీ అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఏ నిమిషం ఏ అప్డేట్ వస్తుందా అని ఉత్సాహంగా ఉన్నారు.
By: Tupaki Desk | 2 Jun 2025 9:29 AM ISTరాజమౌళి మహేష్ కాంబో మూవీ అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఏ నిమిషం ఏ అప్డేట్ వస్తుందా అని ఉత్సాహంగా ఉన్నారు. ఐతే అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి సినిమా తీసి ఎలా హిట్టు కొట్టాలో అన్నదే కాదు ఎప్పుడు ఎలాంటి అప్డేట్ తో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయాలో కూడా తెలుసు. ప్రమోషన్స్ లో పీ.హెచ్.డి చేసిన రాజమౌళి తన సినిమాను ఆస్కార్ దాకా తీసుకెళ్లే సత్తా ఉందని ఇదివరకే ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా గురించి అఫీషియల్ గా ఎక్కడ రివీల్ చేయలేదు.
ఐతే మహేష్ బర్త్ డే నాడు బిగ్ సర్ ప్రైజ్ ఉండబోతుందని తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు కానుకగా సినిమా టీజర్ ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. అంతేకాదు సినిమా షూటింగ్ విషయంలో ఇప్పటివరకు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ వచ్చిందట. సో ఇలానే కొనసాగితే అనుకున్న విధంగా రిలీజ్ కూడా సాధ్యమవుతుందని అంటున్నారు మేకర్స్. రాజమౌళి సినిమా అంటే కనీసం తక్కువలో తక్కువ 2 ఏళ్లు ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.
మహేష్ తో చేస్తున్న సినిమా కాబట్టి ఒక ఏడాది అటైనా పర్వాలేదని అనుకుంటున్నారు. ఈ ఇయర్ మొదట్లో సెట్స్ మీదకు వెళ్లిన SSMB 29 సినిమా రెండేళ్లలో పూర్తి చేసి రిలీజ్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నాడట. అంటే 2027 లో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని గట్టిగా చెబుతున్నారు. అందుకు తగినట్టుగానే ప్లానింగ్ ప్రకారంగా షూట్ చేస్తున్నారని తెలుస్తుంది.
SSMB 29 సినిమా 2027 సెకండ్ హాఫ్ రిలీజ్ ఉండే ఛాన్స్ లు ఉన్నట్టు ఇప్పటికే ఒక టాక్ నడుస్తుంది. అది చిత్ర యూనిట్ వదిలిన న్యూసే అని అంటున్నారు. సినిమా ఒక భాగంగా వస్తే 2027 లో మొదటి పార్ట్ 2028 చివర్లో లేదా 2029లో రెండో భాగం రిలీజ్ చేసేలా రాజమౌళి ప్లానింగ్ ఉందట. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పురాణాల టచ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. మళయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రతినాయకుడిగా చేస్తున్నారు. సో మొత్తానికి మహేష్ రాజమౌళి సినిమా ఏ రేంజ్ లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకున్నారో దానికి ఒక మెట్టు ఎక్కువగానే జక్కన్న ప్లానింగ్ ఉందని అర్ధమవుతుంది.
