Begin typing your search above and press return to search.

SSMB ప్రాజెక్ట్.. నవ్వాలా, ఏడవాలా?

అయితే రాజమౌళితో సినిమా అంటే మూడు,నాలుగేళ్లు పడుతుందని తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   24 July 2025 7:00 PM IST
SSMB ప్రాజెక్ట్.. నవ్వాలా, ఏడవాలా?
X

మహేష్ బాబు, రాజమౌళి సినిమా ప్రకటించినప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. దర్శకధీరుడు, వండర్స్ క్రియేట్ చేసే జక్కన్నతో తమ అభిమాన హీరో మహేష్ సినిమా చేస్తున్నాృడని అభిమానులు ఎంతో షంతోషం వ్యక్తం చేశారు. అయితే రాజమౌళితో సినిమా అంటే మూడు,నాలుగేళ్లు పడుతుందని తెలిసిన విషయమే.

జక్కన్న ప్రాజెక్ట్లు కొన్ని సొంత కారణాల వల్లే ఆలస్యం అవుతూ వస్తాయి. ప్రస్తుతం SSMB కూడా అదే దారిలో నడుస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ ఈ ఏడాది మార్చిలోనే పూర్తైంది. ఒడిశాలో కొరాపుట్ జిల్లా సిమిలిగూడ సమీపంలోని మాలి, పుట్‌సీల్‌, బాల్డ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ఆ తర్వాత కెన్యా లో మరో షెడ్యూల్ కోసం ప్లాన్ చేశారు. అది ఈ నెలలో ఇప్పటికే ప్రారంభమైపోయి ఉండాలి. కానీ, అక్కడి పరిస్థితుల వల్ల ఈ షెడ్యూస్ క్యాన్సిల్ అయిపోయింది. దీంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. కెన్యాకు ప్రత్యమ్నాయంగా సౌతాఫ్రికా ను ఎంచుకున్నట్లు తెలిసింది. కానీ, ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.

అయితే షూటింగ్ కార్యకలాపాలలో జాప్యం వెనుక ఉన్న కారణం గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. అభిమానులు టెన్షన్ అయిపోతున్నారు. కానీ, అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఏ మాత్రం ఆందోళం చెందడం లేదు. ఎక్కడ కనిపించినా ఈ ఇద్దరూ రిలాక్స్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో జక్కన్న సినిమా కథను ఇంకా చెక్కుతున్నరాని తెలుస్తోంది.

వరల్డ్ టాప్ క్లాస్ డైరెక్టర్ రాజమౌళి, మహేష్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. జక్కన్న టాప్ క్లాస్ సినిమా అందించడం ఖాయమేనని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ పై మాత్రం ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమా 2027లోనైనా థియేటర్లలోకి వస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేం.

దీంతో సినిమా ప్రకటన చేసినప్పుడు అభిమానులు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆందోళన చెందుతు్న్నారు. తమ హీరోను థియేటర్లలో ఎప్పుడూ చూస్తామో తెలీదు, ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చిందో క్లారిటీ లేక అయోమయంలో ఉన్నారు. దీంతో నవ్వాలా ఏడవాలా అన్నట్లు తయారైంది వాళ్ల పరిస్థితి.