మరోసారి ఆస్కార్ పై కన్నేసారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్ ఆఫ్రికన్ యాక్షన్ అడ్వెంచర్గా తెరెకెక్కుతోంది. రాజమౌళి సినిమా అంటే దానికి ఎలాంటి హద్దులు ఉండవు.
By: Tupaki Desk | 17 July 2025 11:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్ ఆఫ్రికన్ యాక్షన్ అడ్వెంచర్గా తెరెకెక్కుతోంది. రాజమౌళి సినిమా అంటే దానికి ఎలాంటి హద్దులు ఉండవు. ఆకాశమే హద్దు అనుకొని జకన్న కథను చెక్కుతారు. అయితే ఇది అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతుండండతో ఇది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అవ్వడం పక్కా. అందుకే ఈ సినిమాకు గ్లోబల్ లెవెల్ లో క్రేజ్ తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నారు.
2023లో జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ దాకా వెళ్లారు. కానీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ తో సరిపెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు ఆస్కార్ కొట్టడమే ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారు. అనుకున్నట్లే అటువైపు అడుగులు వేస్తున్నారు. తన సినిమాను ఆస్కార్ కు ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ చేయడం కంటే, డైరెక్ట్ గా హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో తెరకెక్కిస్తే ఈజీగా నామినేట్ చేయవచ్చని జక్కన్న టీమ్ భావిస్తోంది.
హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి సినిమా రూపొందిస్తే, ఆస్కార్ కు నామినేట్ చేయడం సులభం అని రాజమౌళి టీమ్ గ్రహించింది. హాలీవుడ్ సినిమా కేటగిరీలో నామినేట్ చేయడం ఎలానో కూడా రాజమౌళి టీమ్ కు తెలుసు. అందుకే తమ సినిమాను సంయుక్తంగా హాలీవుడ్ బ్యానర్ పై రూపొందించాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పనులన్నీ తమ కుమారుడు కార్తికేయ చక్కబెడుతున్నారట.
ప్రస్తుతం ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ్ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ ప్లాన్ చేస్తున్నందుకు, నారాయణ్ ను కన్ విన్స్ చేస్తున్నారట. హాలీవుడ్ నిర్మాణ సంస్థతో సంయుక్తంగా ఈ సినిమా రూపొందించి, పర్సెంటేజీ విధానంలో లాభాలు తీసుకునేలా ఒప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా తన సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించి, ఆస్కార్ కు నామినేట్ చేయాలని భావించడం రాజమౌళి డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అంటున్నారు.
కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ సినిమా జానర్ గురించి అధికారికంగా ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు. చిన్న క్లూ కూడా బయటకు రాకుండా ఎంతో పడక్బందీగా తెరెకక్కిస్తున్నారు. బీ టౌన్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.800 కోట్ల అని టాక్ ఉంది.
