వారణాసి క్రెడిట్ వార్: ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ?
ఈ చర్చకు ప్రధాన కారణం ప్రముఖ నిర్మాత శోభు యర్లగడ్డ చేసిన ఒక ట్వీట్. `సినిమా సక్సెస్ క్రెడిట్ ఎప్పుడూ దర్శకుడికే చెందుతుంది` అని ఆయన పేర్కొనడం టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసింది.
By: Srikanth Kontham | 1 April 2026 10:08 PM ISTసూపర్ స్టార్ మహేష్ -దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`. ప్రస్తతుం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. కానీ సినిమాకు సంబంధించిన చర్చలు మాత్రం గ్లోబల్ రేంజ్‌లో జరుగు తున్నాయి. తాజాగా ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై సోషల్ మీడియాలో క్రెడిట్ వార్ మొదలైంది. నెటిజన్లు, అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి తమ వాదనలను వినిపిస్తున్నారు.
ఈ చర్చకు ప్రధాన కారణం ప్రముఖ నిర్మాత శోభు యర్లగడ్డ చేసిన ఒక ట్వీట్. `సినిమా సక్సెస్ క్రెడిట్ ఎప్పుడూ దర్శకుడికే చెందుతుంది` అని ఆయన పేర్కొనడం టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసింది.
సినిమా అనేది దర్శకుడి ఆలోచన నుంచి పుడుతుందని కథా గమనం నుండి ప్రతి ఫ్రేమ్ వరకు ఆయనే నిర్ణయిస్తారు కాబట్టి ఆ విజయానికి ఆయనే అసలైన కర్త అని శోభు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజమౌళి అభిమానులకు బలాన్ని ఇచ్చాయి. అయితే మహేష్ అభిమానులు , మరికొందరు సినీ విశ్లేషకులు ఈ వాదనతో విభేదిస్తున్నారు. ఎంత పెద్ద దర్శకుడైనా? ఒక భారీ ప్రాజెక్టుకు స్టార్ హీరో ఇమేజ్ తోడైతేనే దానికి అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ వస్తుందని వాదిస్తున్నారు. హీరో బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ , మేకోవర్ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు.
ఈ నేపథ్యంలో సక్సెస్‌లో హీరోకు కూడా సమానమైన వాటా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాల విషయంలో ఈ చర్చ ఎప్పుడూ ఉంటుంది. రాజమౌళి ఒక బ్రాండ్ అని, ఆయన పేరు మీదనే బిజినెస్ జరుగుతుందని ఒక వర్గం అంటే? మహేష్ లాంటి ఇమేజ్ ఉన్న గ్లోబల్ స్టార్ తోడవ్వడం వల్లే ఈ సినిమాకు ఈ స్థాయి క్రేజ్ వచ్చిందని మరో వర్గం అంటోంది. సోషల్ మీడియాలో ఎస్ ఎస్ ఎంబీ 29కి పోటీగా పోటీగా ఎస్ ఎస్ ఆర్ 13 అనే హాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవ్వడం ఈ క్రెడిట్ వార్ తీవ్రతను తెలియజేస్తోంది.వాస్తవానికి సినిమా విజయం అనేది టీమ్ వర్క్. దర్శకుడు కథను చెబితే హీరో దానికి ప్రాణం పోస్తారు.
రాజమౌళి తన విజన్ తో అద్భుతమైన లోకాన్ని సృష్టిస్తే మహేష్ తన నటనతో ఆ లోకంలో ప్రేక్షకులను లీనం చేస్తారు. స్టార్ హీరో లేకపోతే భారీ ఓపెనింగ్స్ రావడం కష్టం. అలాగే సరైన దర్శకుడు లేకపోతే స్టార్ హీరో ఉన్నా సినిమా నిలబడదని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రెడిట్ వార్ ఎలా ఉన్నా? రాజమౌళి -మహేష్ ల కలయిక తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాల్లో మరో మెట్టు ఎక్కించడం ఖాయం. ఒకరిని తక్కువ చేసి మరొకరిని ఎక్కువ చూడటం కంటే? ఇద్దరి ప్రతిభ కలిస్తేనే `వారణాసి` వంటి అద్భుతాలు సాధ్యమవుతాయని గ్రహించాలి. ఈ సినిమా విడుదలయ్యాక వచ్చే భారీ విజయం అటు రాజమౌళికి, ఇటు మహేష్ ఇద్దరికీ గర్వకారణం. వెరసీ ఆఫలితం తెలుగు సినిమా కీర్తిని మరింత పెంచుతుంది.
