సింగిల్ ఫ్రేమ్‌లో వారిద్దరూ.. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినట్టేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబీ29.
By: Tupaki Desk | 16 Aug 2025 5:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబీ29. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు ఇప్పటికే లీకులు వచ్చాయి. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్నట్టు ఇప్పటివరకు లీకులు రావడమే కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా వచ్చింది లేదు.
రీసెంట్ గా ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి ఓ అప్డేట్ ను ఇవ్వగా అది నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మహేష్, ప్రియాంక చోప్రా కలిసి ఉన్న ఓ ఫోటో ఒకటి బయటికొచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ లీకైన ఫోటో మహేష్ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటో అయుండొచ్చని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఈ ఫోటోలో మహేష్ బాబు టీ షర్ట్ లో క్యాప్ పెట్టుకుని చాలా కూల్ గా కనిపిస్తుండగా, ప్రియాంక చోప్రా స్లీవ్‌లెస్ టాప్ లో మెరిశారు. మహేష్, ప్రియాంక కలిసి ఇప్పటివరకు ఏ సినిమాలోనూ స్క్రీన్ ను షేర్ చేసుకుంది లేదు. ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక నటిస్తుందని తెలిశాక కూడా వీరిద్దరూ కలిసి ఏ ఫోటోలోనూ కనిపించలేదు. దీంతో వీరిద్దరూ కనిపించిన మొదటి ఫోటో ఇదేనని ఆ ఫోటోను మహేష్ ఫ్యాన్స్ వెంటనే వైరల్ చేశారు.
వీరిద్దరూ కలిసి నటిస్తే చూడ్డానికి వెయిట్ చేస్తున్నామని ఫ్యాన్స్ ఆ ఫోటో కింద పోస్టులు పెడుతూ దాన్ని తెగ వైరల్ చేస్తుండగా, ఆ ఫోటోలో ప్రియాంక, మహేష్ తో పాటూ పలువురు యూనిట్ సభ్యులు కూడా కనిపిస్తున్నారు. ఇక ఎస్ఎస్ఎంబీ29 విషయానికొస్తే ఈ సినిమా ఒక గ్లోబ్ ట్రాటింగ్ ఫారెస్ట్ అడ్వెంచర్ గా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఈ సినిమా బిగ్గెస్ట్ ఫిల్మ్ కాబోతుందని ఇప్పటికే రాజమౌళి చెప్పగా, నవంబర్ లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
