Begin typing your search above and press return to search.

మహేష్‌ బాబు అనగనగా ఏమన్నాడంటే..!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   25 Jun 2025 4:05 PM IST
మహేష్‌ బాబు అనగనగా ఏమన్నాడంటే..!
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు పాన్‌ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి సినిమా అంటేనే చాలా ఆలస్యం అవుతుంది. మహేష్ బాబు సినిమా కోసం ఏకంగా ఏడాది పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ చేసిన రాజమౌళి, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసం మరికొన్నాళ్లు తీసుకున్నాడు. ఎట్టకేలకు షూటింగ్‌ ప్రారంభించిన రాజమౌళి బ్యాక్ టు బ్యాక్‌ షెడ్యూల్స్‌ను చేస్తున్నాడు. గత నెలలో సమ్మర్‌ హాలీడేస్‌ను తీసుకున్న విషయం తెల్సిందే. తిరిగి షూటింగ్‌ ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రియాంక చోప్రా కూడా హైదరాబాద్‌ వచ్చింది. దాంతో మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో సన్నివేశాలతో పాటు, పాట చిత్రీకరణ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు తనకు నచ్చిన సినిమాల గురించి, తన సన్నిహితుల సినిమాల గురించి అప్పుడప్పుడు సోషల్‌ మీడియా ద్వారా స్పందించడం మనం చూస్తూనే ఉంటాం. కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలకు కూడా తన రివ్యూను ఇస్తూ ఉంటాడు. ఇటీవల బాలీవుడ్‌ మెగాస్టార్‌ ఆమీర్‌ ఖాన్‌ నటించిన సితారే జమీన్‌ పర్‌ సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు. మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా అంటూ అభినందించాడు. అంతే కాకుండా అంతా చూడాల్సిన సినిమా అని కూడా చెప్పుకొచ్చాడు. ఇలాంటి కాన్సెప్ట్‌లతో సినిమాను చేయడం అనేది గొప్ప విషయం అన్నట్లుగా చెప్పుకొచ్చిన మహేష్ బాబు తాజాగా తెలుగు సినిమాకు రివ్యూ ఇచ్చాడు.

చాలా రోజుల క్రితం విడుదల అయిన 'అనగనగా..' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను థియేట్రికల్‌ రిలీజ్‌ చేయాలని కూడా చాలా మంది అన్నారు. ఇలాంటి సినిమాలను ఓటీటీ ద్వారా కంటే థియేట్రికల్‌ రిలీజ్ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం చేసిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే లిమిటెడ్‌ థియేటర్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్‌ తర్వాత రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. జనాలు ఈ సినిమా గురించి మరచి పోతున్న సమయంలో మహేష్‌ బాబు ఈ సినిమా గురించి స్పందించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్ ద్వారా మహేష్‌ బాబు స్పందిస్తూ... అనగనగా సినిమా చాలా చక్కగా చెప్పడిని మంచి కథ. భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా బాగుంది. మీరు తప్పకుండా సమయం వ్యచ్ఛించి చూడదగ్గ సినిమా. సుమంత్‌తో పాటు మొత్తం యూనిట్‌ సభ్యుల ప్రయత్నం అభినందనీయం. వారికి నా అభినందలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు. ఈటీవీ విన్‌లో ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది. అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. సినిమా కు ఇప్పుడు మహేష్‌ బాబు రివ్యూ ఇవ్వడంతో కచ్చితంగా సినిమా కు మరోసారి ఈటీవీ విన్‌లో మంచి స్పందన దక్కడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.