మహేష్ నెక్స్ట్ ఫిక్స్ అయినట్లేనా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ డ్రామా వారణాసి మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Feb 2026 11:45 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ డ్రామా వారణాసి మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాపై ఇప్పటికే నేషనల్ వైడ్ గా మాత్రమే కాకుండా ఓవర్సీస్ లోని తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ మూవీ ఇంకా సెట్స్ పైనే ఉండగా.. మహేష్ నెక్స్ట్ సినిమా కోసం చర్చ ఇప్పుడు జోరందుకుంది.
సాధారణంగా ఒక సినిమా షూటింగ్ లో ఉండగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసుకునే అలవాటు మహేష్ బాబుకు ఉంది. గతంలో గుంటూరు కారం షూటింగ్ సమయంలో రాజమౌళి సినిమా లాక్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మాత్రం ఆ సెంటిమెంట్ ను పక్కన పెట్టి, వారణాసి పూర్తయ్యే వరకు కొత్త నిర్ణయం తీసుకోవద్దని భావిస్తున్నారట. జూన్ చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసి.. ఆ తర్వాత ప్రమోషన్స్, డబ్బింగ్ పనులు చేపట్టనున్నారు.
ఇక మహేష్ డేట్స్ కోసం అగ్ర నిర్మాణ సంస్థలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా హోంబలే ఫిలిమ్స్, సన్ పిక్చర్స్ వంటి సంస్థలు మహేష్ తో భారీ ప్రాజెక్ట్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్ కాబట్టి, కనీసం రూ.500 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మహేష్ బాబు కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లొచ్చనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం సరైన సమయం కుదిరిందని అంటున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ తెరకెక్కిస్తున్నారు.
అది పూర్తయ్యాక ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. మరోవైపు సందీప్ వంగా ఇప్పటికే ప్లాన్ చేసిన యానిమల్ పార్క్ మూవీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం రామాయణ షూటింగ్ తో బిజీగా ఉండటమే కారణం. దీంతో ఆ గ్యాప్ లో మహేష్ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ లేదా నిర్మాత సునీల్ నారంగ్ బ్యానర్ లో నిర్మించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
అయితే మహేష్ నెక్స్ట్ మూవీ రేసులో ప్రశాంత్ నీల్, అట్లీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అందుకే వారణాసి తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో చేతులు కలుపుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సందీప్ రెడ్డి, మహేష్ కాంబినేషన్ కుదిరితే మాత్రం అది కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించే ప్రాజెక్ట్ అవుతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మహేష్ నెక్స్ట్ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
