Begin typing your search above and press return to search.

రాజమౌళి సినిమా.. రిస్కుకు సిద్ధమైన మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో SSMB29 రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 July 2025 6:42 PM IST
రాజమౌళి సినిమా.. రిస్కుకు సిద్ధమైన మహేష్
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో SSMB29 రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్. మాధవన్ మహేష్ తండ్రిగా కనిపించనున్నట్లు సమాచారం.

భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా కోసం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని జక్కన్న.. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుతున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన రాజమౌళి.. త్వరలో మూవీ టీమ్ కెన్యా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

అనంతరం హైదరాబాద్ శివార్లలో వేసిన వారణాసి సెట్ లో షూట్ చేయనున్నారని సమాచారం. అయితే ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్ లో రూపొందుతున్న సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో వేరే లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని ప్రతీ ఒక్క సినీ ప్రియుడు, ఫ్యాన్ ఫిక్స్ అయిపోయారని చెప్పాలి.

అయితే సినిమాలో యాక్షన్ సీన్స్ ఫుల్ గా ఉన్నట్లు ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఫారెస్ట్ అడ్వెంచర్ కాబట్టి అనేక స్టంట్స్ ఉంటాయి. నెవ్వర్ బిఫోర్ అనేలా మహేష్ బాబు.. యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. దీంతో అంతా వాటిని చూసేందుకు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అదే సమయంలో ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. సాధారణంగా చాలా మంది హీరోలకు డూప్స్ ఉంటారు. కొన్ని యాక్షన్ సీన్స్ లో వారే నటిస్తారు. కానీ ఇప్పుడు డూప్స్ కు మహేష్ నో చెప్పేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తానే స్వయంగా యాక్షన్ మోడ్ లో దిగుతున్నారని సమాచారం.

డూప్స్ బదులు హార్డ్ వర్క్ చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకు గాను ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియదు. ఒకవేళ నిజమైతే మాత్రం.. ఇప్పటి వరకు మహేష్ కెరీర్ లో భారీ యాక్షన్ సీన్స్ లో నటించడం ఇదే తొలిసారి. రిస్క్ కూడా సిద్ధమైనట్లే. మరి చూడాలి ఏం జరుగుతుందో..