Begin typing your search above and press return to search.

మహేష్ లిస్ట్ లో ఆ డైరెక్టర్..?

ఒకేసారి టీజర్ తోనో లేదా పోస్టర్ వదిలి జక్కన్న ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నాడేమో చూడాలి.

By:  Tupaki Desk   |   23 May 2025 6:00 AM IST
మహేష్ లిస్ట్ లో ఆ డైరెక్టర్..?
X

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. గుంటూరు కారం తర్వాత తన మేకోవర్ కోసం కొద్దిగా టైం తీసుకున్న మహేష్ సైలెంట్ గా రాజమౌళి సినిమా షూటింగ్ మొదలు పెట్టడం జరిగింది. సినిమా ఓ పక్క షూటింగ్ జరుగుతున్నా ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ గా చెప్పకపోవడం పెద్ద కన్ ఫ్యూజింగ్ గా ఉంది. ఒకేసారి టీజర్ తోనో లేదా పోస్టర్ వదిలి జక్కన్న ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నాడేమో చూడాలి.

SSMB 29వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా కథ ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ అని అంటున్నారు. ఆఫ్రికన్ అడవుల్లో త్వరలో షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైం లో పూర్తి చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడట. అందుకే సినిమాను పర్ఫెక్ట్ షెడ్యూల్ లో కానిస్తున్నాడు. సినిమాను 2027 లో రిలీజ్ చేసేలా రాజమౌళి గట్టి ప్లానింగ్ తో ఉన్నాడని టాక్.

ఇక రాజమౌళి తో సినిమా చేశాక నెక్స్ట్ మహేష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అన్న ప్రశ్న ఎదురవుతుంది. పాన్ ఇండియా హీరోగా అప్పటికే ఒక లెవెల్ సెట్ చేస్తాడు కాబట్టి నెక్స్ట్ కూడా అదే రేంజ్ సినిమా చేసే డైరెక్టర్ తోనే చేతులు కలపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మహేష్ లిస్ట్ లో చాలా మంది దర్శకుల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో సుకుమార్, సందీప్ వంగ లాంటి వాళ్లు ఉన్నారట.

సుకుమార్ తో ఆల్రెడీ 1 నేనొక్కడినే సినిమా చేశాడు మహేష్. ఆ సినిమా వర్కవుట్ కాలేదు అందుకే సుకుమార్ కూడా మహేష్ తో ఒక మంచి సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. సందీప్ వంగ కూడా యానిమల్ తో అదరగొట్టాడు నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. సో మహేష్ ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

రాజమౌళి తో సినిమా చేశాడంటే తప్పకుండా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో కూడా మహేష్ పడతాడు. అప్పుడు అక్కడ స్టార్ డైరెక్టర్స్ సైతం మహేష్ తో సినిమాకు రెడీ అనేస్తారు. జక్కన్న సినిమా తర్వాత మహేష్ ఎవరితో చేస్తాడన్నది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గా మారింది. మరి ఆ ఛాన్స్ మహేష్ ఎవరికి ఇస్తాడన్నది అప్పుడే తెలుస్తుంది.