Begin typing your search above and press return to search.

రాజమౌళి తర్వాత మహేష్‌కు బెస్ట్ ఛాయిస్ ఎవరు?

ఇలాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడనే చర్చ ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్ అయింది.

By:  Tupaki Desk   |   28 May 2025 9:30 AM
రాజమౌళి తర్వాత మహేష్‌కు బెస్ట్ ఛాయిస్ ఎవరు?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఇండియన్ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 సినిమా 1000 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటుండటం, ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను ఇప్పటికే ఆకాశానికెత్తేశాయి. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మహేష్ కెరీర్‌లో గేమ్‌చేంజర్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా.

ఇలాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడనే చర్చ ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే, రాజమౌళి తర్వాత వచ్చే చిత్రం అంచనాల పరంగా రెండింతలు భారీగా ఉండాలి. ప్రేక్షకుల దృష్టిలో మహేష్‌ను కొత్తగా చూపించగల దర్శకుడితోనే ఆయన ముందుకు సాగాలి. ఈ క్రమంలో కొంతమంది దర్శకుల పేర్లు హాట్ టాపిక్ గా మారాయి.

సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, బుచ్చిబాబు వంటి వారి పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. వీళ్లలో ఒకరితో మహేష్ బాబు తదుపరి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ ముగ్గురు దర్శకులు ముగ్గురూ డిఫరెంట్ స్టైల్ తో ఆకట్టుకునేవారే. సందీప్ రెడ్డి వంగా అయితే కథనాన్ని డార్క్‌గా నడిపిస్తూ, హీరో పాత్రలో ఎమోషనల్ డెప్త్ చూపించడంలో ప్రత్యేకత ఉన్నవాడు.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ లాంటి సినిమాలు దీనికి నిదర్శనం. మహేష్‌తో ఈయన సినిమా అంటే, ఓ ఇంటెన్స్ పాత్రలో సూపర్ స్టార్‌ను చూడొచ్చు. అటు నాగ్ అశ్విన్ విషయానికి వస్తే, వైవిధ్యమైన కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి పేరు సంపాదించాడు. మహానటి, పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898AD' చూస్తే, విజువల్ గాంభీర్యాన్ని ఎలా మలుచుకోవాలో తెలిసినవాడు. మహేష్‌తో ఓ విజువల్ వండర్ రానున్నదన్న అంచనాలు తటస్థంగా ఉంటాయి.

ఇక బుచ్చిబాబు సాన, ఉప్పెన సినిమాతోనే ఇండస్ట్రీలో తన మార్క్ చూపించాడు. రామ్ చరణ్ తో చేస్తున్న పెద్ది ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. బుచ్చిబాబు స్టైల్ చూస్తే, మాస్, క్లాస్ కలిపి గట్టిగా మిడిల్ క్లాస్ భావోద్వేగాలు చెప్పడంలోనూ దిట్ట. మహేష్‌ను కొత్తగా, సాధారణ ప్రజల పక్కన ఉన్న వ్యక్తిగా చూపించగల డైరెక్టర్ అనిపించేది ఇతనే కావొచ్చు.

మొత్తానికి, ముగ్గురిలో ఎవరు ఎంపికవుతారో తెలియదు కానీ… ఒక విషయం మాత్రం ఖచ్చితం – రాజమౌళి తర్వాత మహేష్ చేయబోయే సినిమా అతని కెరీర్‌లో మరో కీలక మలుపుగా నిలుస్తుంది. అభిమానులు మాత్రం ఆయనను ఓ మాస్ – క్లాస్ మిక్స్ స్టోరీలో చూడాలని ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు డైరెక్టర్స్‌లో ఎవరిదైనా కానీ, మహేష్‌ను కొత్తగా, భారీగా చూపించడంలో ఏమాత్రం తగ్గకుండా ఉంటారన్నది మాత్రం గ్యారంటీ.