Begin typing your search above and press return to search.

చైతూ, శోభితను మహేశ్ పట్టించుకోలేదా? అసలైన వీడియో ఇదిగో!

అనంతరం శోభితను కూడా నవ్వుతూ పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు రావడంతో అసలు విషయం తెలిసింది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 4:59 PM IST
చైతూ, శోభితను మహేశ్ పట్టించుకోలేదా? అసలైన వీడియో ఇదిగో!
X

అక్కినేని కపుల్, హీరో- హీరోయిన్లు నాగచైతన్య, శోభితను సూపర్ స్టార్ మహేష్ బాబు పట్టించుకోలేదంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని కారణాల వల్ల మాట్లాడటం ఇష్టం లేక చూసీ చూడనట్టుగా వెళ్లిపోయారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు ప్రూఫ్ అంటూ ఓ వీడియో వైరలైంది.

దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చర్చ జరగ్గా.. ఇప్పుడు మరో వీడియో బయటకు రావడంతో క్లారిటీ వచ్చింది. ఒక్క వీడియోతో ఏవేవో ఊహించుకుని రూమర్స్ క్రియేట్ చేసి పెట్టిన పోస్ట్ లకు చెక్ పడింది. అసలేం జరిగిందంటే? ఎప్పుడు జరిగింది? ఆ వీడియోస్ సంగతేంటి? మహేష్ ఏం చేశారు? ఓసారి తెలుసుకుందాం.

రీసెంట్ గా అక్కినేని వారసుడు, యంగ్ హీరో అఖిల్.. వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. నాగార్జున ఇంట్లో తన ప్రేయసి జైనబ్ మెడలో మూడుముళ్లు వేశారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ గా రిసెప్షన్ ను ఏర్పాటు చేసింది. అతిరథ మహరథులను సాదరంగా ఆహ్వానించింది.

అందులో భాగంగా మహేష్ ను పిలవగా, ఆయన తన భార్య నమ్రత, కుమార్తె సితారతో వెడ్డింగ్ రిసెప్షన్ లో సందడి చేశారు. ఆ సమయంలో సింపుల్ టీ షర్ట్ తో వచ్చిన మహేష్ బాబు.. ఈవెంట్ లో నాగ చైతన్య, శోభిత అక్కడే ఉన్నా.. చూడకుండా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కానీ ఆ తర్వాత చైతూ, శోభితను నమ్రత ఎంతో ప్రేమగా పలకరించారు. మహేష్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం శోభితను కూడా నవ్వుతూ పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు రావడంతో అసలు విషయం తెలిసింది. ముందు మహేష్ వారిని చూడకపోయుంటారని అర్థమవుతుంది.

కాగా.. నాగచైతన్య, శోభిత కొంత కాలంపాటు ప్రేమలో ఉన్నారు. అనేక రూమర్లు వచ్చినా ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. సడెన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. ఆ తర్వాత గత ఏడాది డిసెంబర్ లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్డూడియోస్ లో ఏఎన్నార్ విగ్రహం ఎదురుగా మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. జూన్ 6న అఖిల్‌- జైనబ్‌ పెళ్లి జరగ్గా, జూన్‌ 8న రిసెప్షన్‌ జరిగింది.