Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : గౌతమ్‌, సితార మ్యాజిక్ మూమెంట్స్

నమ్రత ఈ ఫోటోను షేర్ చేయడంతో పాటు.. ఫోటోకు మ్యాజిక్‌ మూమెంట్స్‌, అన్న చెల్లి ప్రేమ అంటూ లవ్‌ ఫేస్ ఈమోజీని షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   21 May 2025 2:20 PM IST
పిక్‌టాక్ : గౌతమ్‌, సితార మ్యాజిక్ మూమెంట్స్
X

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యామిలీ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూనే ఉంటుంది. మహేష్‌ బాబు, నమ్రత పిల్లలు సితార, గౌతమ్‌ చిన్నప్పటి నుంచి రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. వారు ఏ ఈవెంట్‌లో పాల్గొన్నా కూడా అందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్‌ అవుతూ ఉండేవి. ముఖ్యంగా సితారకు చిన్నప్పటి నుంచే మంచి ఫాలోయింగ్‌ దక్కింది. సితార సోషల్‌ మీడియాలో చిన్నతనం నుంచే హీరోయిన్స్ రేంజ్‌లో ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. ఇన్‌స్టాలో సొంతంగా ఖాతాను కలిగి ఉన్న సితూపాప లక్షలాది మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న విషయం తెల్సిందే. తన డాన్స్‌, ఫోటోలు, వీడియోలతో సితూ పాప వైరల్‌ అవుతూ ఉంటుంది.

సితార, గౌతమ్‌లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను నమ్రత ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తూ ఉంటుంది. వారు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ ఫోటోలు, వీడియోలు షేర్ చేసిన నమ్రత ఈ మధ్య కాలంలో కాస్త తగ్గించింది. గౌతమ్‌ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తే.. సితూ పాప కూడా బిజీ బిజీగా ఉంటుంది. అందుకే వారికి సంబంధించిన ఫోటోలను నమ్రత షేర్‌ చేయలేక పోతుంది. తాజాగా అన్న చెల్లి ఫోటోను షేర్‌ చేసింది. గౌతమ్‌, సితార సరదాగా చిల్‌ అవుతూ సోఫాలో కూర్చుని ఉన్న ఫోటోను నమ్రత షేర్ చేసింది. ఇద్దరు ఏదో విషయం గురించి చాలా సీరియస్‌గా మాట్లాడుకుంటున్నట్లుగా ఫోటోలో కనిపిస్తుంది.

నమ్రత ఈ ఫోటోను షేర్ చేయడంతో పాటు.. ఫోటోకు మ్యాజిక్‌ మూమెంట్స్‌, అన్న చెల్లి ప్రేమ అంటూ లవ్‌ ఫేస్ ఈమోజీని షేర్‌ చేసింది. గౌతమ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి గౌతమ్‌ చదువుపై దృష్టి పెట్టాడు. త్వరలోనే ఆయన చదువు పూర్తి కానుంది. ఆ తర్వాత నటనకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ తీసుకుంటాడని తెలుస్తోంది. ఇప్పటికే డాన్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ కి సంబంధించిన శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. ఇక సితార కూడా నటిగా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. సితార కూడా అందుకు ఆసక్తిగానే ఉన్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లను చూస్తే అనిపిస్తూ ఉంటుంది.

సితార, గౌతమ్‌ ఇద్దరూ తల్లిదండ్రుల వారసత్వంతో నటనలోకి అడుగు పెడితే కచ్చితంగా అభిమానుల నుంచి మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. సితార సినిమాల్లో కనిపించలేదు, కానీ యాడ్స్‌లో, ఒక పాటలోనూ కనిపించింది. కానీ గౌతమ్ మాత్రం సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే సినిమాలో నటించి మెప్పించాడు. ఇక హీరోగానే గౌతమ్ నటించాలనే ఉద్దేశంతో ఆ తర్వాత పలువురు దర్శకులు అడిగిన మహేష్ బాబు నో చెప్పారని తెలుస్తోంది. ఇక మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు. 2027 కి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.