మహేష్ వారందరి కంటే గొప్పోడా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న డైరెక్షన్‌లో భారీ పాన్ వరల్డ్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 24 May 2025 12:13 PMసూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం జక్కన్న డైరెక్షన్‌లో భారీ పాన్ వరల్డ్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. రాకెట్ స్పీడుతో ఫస్ట్,సెకండ్ షెడ్యూల్‌ని పూర్తి చేసిన రాజమౌళి థర్డ్ షెడ్యూల్‌కు కాస్త బ్రేక్ తీసుకున్నాడు. అనౌన్స్‌మెంట్ లేకుండానే సెట్స్‌పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ ని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా జెట్ స్పీడుతో పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. అందులో భాగంగానే షూటింగ్‌ని పరుగులు పెట్టిస్తున్నాడట. త్వరలోనే థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది.
జూన్ 1 నుంచి హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గత కొంత కాలంగా టాలీవుడ్ టాప్ హీరో ఎవరనే దానిపై చర్చ జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ టాప్ స్టార్లతో పోలిస్తే ఓ విషయంలో మహేష్ గ్రేట్ అని తెలుస్తోంది. గత కొంత కాలంగా టాప్ స్టార్లకు సంబంధించిన కెరీర్ హిట్ మూవీస్ రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మహేష్ హిట్ సినిమాలతో ఈ సంప్రదాయం టాలీవుడ్‌లో మొదలైంది.
ఇప్పటికే మహేష్ నటించిన మురారి, పోకిరి,ఒక్కడు సినిమాలు విడుదలై రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించాయి. రీ రిలీజ్‌ల విషయంలో టాలీవుడ్‌లో మహేష్ టాప్ అని ఇవి నిరూపించాయి. తాజాగా మహేష్ నటించిన `ఖలేజా` మూవీని 4కెలో ఈ నెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. 2010లో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా ఆ తరువాత కల్ట్ క్లాసిక్ అనిపించుకుంది. రీ రీలీజ్ వేళ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది.
హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అదరగొట్టేస్తోంది. బుక్ మై షోలోఅడ్వాన్స్ బుకింగ్స్ భారీగా నమోదు అవుతుండటంతో `ఖలేజా` వసూళ్ల పరంగా గత సినిమాల రికార్డుల్ని తిరగరాయడం ఖాయం అని అంటున్నారు. అంతే కాకుండా మహేష్ చేసిన ఈ తరహా ప్రయోగాలు ఏ హీరో చేయలేదని, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో ఉందని, తన ఫాలోయింగ్‌ని బట్టి చూస్తే రీ రిలీజ్‌ల పరంగా మహేష్ టాలీవుడ్‌లో టాప్ లీడ్‌లో ఉన్నాడని కామెంట్‌లు చేస్తున్నారు.