ఖలేజాను చంపేసింది మహేష్ అభిమానులేనట!
దీంతో ఖలేజా రీ రిలీజ్ ట్రెండ్ లో బెంచ్ మార్క్ క్రియేట్ చేయనుందని జోరుగా ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 29 May 2025 10:48 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా మూవీ గురించి అందరికీ తెలిసిందే. 15 ఏళ్ల క్రితం భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అప్పట్లో ఆ మూవీ మేకర్స్ కు భారీ నష్టాలు కూడా వచ్చాయని టాక్ వినిపించింది.
కానీ సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు మే 30వ తేదీన రీ రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దాదాపు రూ.5 కోట్ల రూపాయలను ఇప్పటికే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా రూ.10 కోట్లు రాబట్టనుందని అంచనాలు ఉన్నాయి.
దీంతో ఖలేజా రీ రిలీజ్ ట్రెండ్ లో బెంచ్ మార్క్ క్రియేట్ చేయనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ఖలేజా మూవీ నిర్మాతల్లో ఒకరైన సి. కల్యాణ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
"ఖలేజా మూవీ ప్రీమియర్ ను విజయవాడలో వేశారు. ఆ రోజు సినిమాను చూడనివ్వలేదు. ఓపెన్ గా చెబుతున్నా.. సినిమాను చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే. వారు ఏదో ఊహించుకుని సినిమాకు వెళ్లారు. మహేష్ కామెడీ చేస్తే.. యాక్ట్ చేస్తే.. వాళ్లకు అర్థం కాలేదు.. తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టారు" అని తెలిపారు.
"నిజానికి నేను అప్పుడు మిడ్ నైట్ షో ఇవ్వనన్నాను. కృష్ణ గారు నాకు ఫోన్ చేసి.. ఏంటయ్యా కల్యాణ్ ప్రీమియర్ షో వేయనని అంటున్నావ్ అన్నారు. బలవంతంగా ఇచ్చాను.. రాత్రి షో అయ్యాక మహేష్ అభిమానులు తాగేసి ఫోన్ చేసి బూతులు తిట్టారు.. నీకు సినిమా తీయడం తెలుసా? అంటూ నన్ను, డైరెక్టర్ ను తిట్టారు" అని చెప్పారు.
"మహేష్ అభిమానులే మెసేజెస్ పంపేసి సర్వనాశనం చేశారు. ఈ రోజు ఆ ఫ్యాన్స్ మళ్లీ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా బిగ్ స్క్రీన్ మీద వస్తుంటే.. దానిని మళ్లీ చూసి మాట్లాడతారు. తప్పు చేశామని ఒప్పుకుంటారు. 14 సంవత్సరాల తర్వాత సక్సెస్ రావాలని రాసిపెట్టి ఉంది. సక్సెస్ మీట్ లో మళ్లీ కలుద్దాం" అని సీ కల్యాణ్ తెలిపారు.
