Begin typing your search above and press return to search.

ధూమ్-4 రేసులో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌!

తాజాగా వీళ్లిద్ద‌రితో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా రేసులో నిలిచాడు. మ‌హేష్ గ‌నుక ఎంట్రీ ఇస్తే?

By:  Tupaki Desk   |   6 Jun 2025 6:45 PM
ధూమ్-4  రేసులో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌!
X

'ధూమ్ -4' లో మ‌హేష్ ఈ ఊహే ఎంతో గొప్ప‌గా ఉంది. అదే జ‌రిగితే ఇంకెంత గొప్ప‌గా ఉంటుంది. గ్లోబ‌ల్ రేంజ్ లో ధూమ్ 4 ఓసంచ‌ల‌నంగా మారుతుంది. మ‌రి అందుకు ఆస్కారం ఉందా? అంటే ఉన్న‌ట్లే క‌ని పిస్తుంది. ధూమ్ ప్రాంచైజీ బాలీవుడ్ కే వ‌న్నే తీసుకొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ రిలీజ్ అయిన మూడు భాగాలు సంచ‌ల‌న విజ‌యాలు అందుకున్న‌వే. జాన్ అబ్ర‌హాం, హృతిక్ రోష‌న్, అమీర్ ఖాన్ రేంజ్ ని పెంచిన ప్రాంచైజీ ఇది.

ఈ ప్రాంచైజీకంటూ ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. చాలా కాలంగా 'ధూమ్ 4' ఎప్పుడంటూ నెట్టింట అడుగుతూనే ఉన్నారు. కానీ ఇంత‌కాలం అందుకు స‌రైన స‌మాధానం దొక‌లేదు. తాజాగా 'ధూమ్ 4'కి రంగం సిద్ద‌మ‌వుతుంది. ఈసారి ఈ ప్రాజెక్ట్ ను యాక్ష‌న్ చిత్రాల సంచ‌ల‌నం ఆయాన్ ముఖ‌ర్జీ టేక‌ప్ చేస్తున్నాడు. హీరో ఎవ‌రు? అన్న‌ది ఇంకా క‌న్ప‌మ్ కాలేదు. రాక్ స్టార్ ర‌ణ‌బీర్ క‌పూర్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. న‌టించ డానికి ర‌ణ‌బీర్ ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు స‌మాచారం.

అలాగే ర‌ణ‌వీర్ సింగ్ పేరు కూడా వినిపించింది. తాజాగా వీళ్లిద్ద‌రితో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా రేసులో నిలిచాడు. మ‌హేష్ గ‌నుక ఎంట్రీ ఇస్తే? ధూమ్ 4 ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమా రేంజ్ ఏకంగా పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ నే తాకుతుంది. ఆ సిరీస్ లో మ‌హేష్ క‌టౌట్ క‌నిపించ‌డ‌మే పెద్ద సంచ‌ల‌న మ‌వుతుంది. ఎస్ ఎస్ ఎంబీ 29 తో మ‌హేష్ ఇమేజ్ గ్లోబల్ స్థాయిని తాకుతుంది.

ప్ర‌స్తుతం ఈ చిత్రం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. జ‌క్క‌న్న క్రియేటివిటీతో మ‌హేష్ రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. 'ధూమ్ 4' ప్రారంభానికి కూడా రెండేళ్ల స‌మ‌యం ప‌డుతుంది. ఆలోపు మహేష్ కూడా ఫ్రీ అయిపోతాడు. నిజంగా ఎంట్రీ ఇస్తే ధూమ్ 4 నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటుంది.