Begin typing your search above and press return to search.

సింపుల్ టీ షర్ట్ లో మహేష్.. ధర తెలిస్తే మాత్రం షాకే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవర్ గ్రీన్ హీరో అనే చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. షైనింగ్ స్కిన్ టోన్ తో ఎప్పుడూ అట్రాక్టివ్ గా కనిపిస్తుంటారు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 11:38 AM IST
సింపుల్ టీ షర్ట్ లో మహేష్.. ధర తెలిస్తే మాత్రం షాకే!
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవర్ గ్రీన్ హీరో అనే చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. షైనింగ్ స్కిన్ టోన్ తో ఎప్పుడూ అట్రాక్టివ్ గా కనిపిస్తుంటారు. వయసుతోపాటు ఆయన అందం కూడా పెరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఏ ఈవెంట్ కు వెళ్లినా.. ఏ ఫంక్షన్ కు అటెండ్ అయినా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తారు.

రీసెంట్ గా అన్నపూర్ణ స్డూడియోస్ లో జరిగిన యంగ్ హీరో అఖిల్, జైనబ్ రవ్జీ మ్యారేజ్ రిసెప్షన్ కు మహేష్ బాబు తన ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు. సతీమణి నమ్రత, కుమార్తె సితారతో కనిపించారు. వేదికపైకి వెళ్లి కొత్త జంటకు బెస్ట్ విషెస్ తెలిపారు. వారితో ఫోటోలు కూడా దిగారు. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

అదే సమయంలో మహేష్ బాబు స్టైలిష్ లుక్ కోసం ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. టీ షర్ట్ వేసుకుని వచ్చిన ఆయన.. హ్యాండ్సమ్ గా, డైనమిక్ గా కనిపించారు. అయితే మహేష్ టీ షర్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సింపుల్ గా కనిపిస్తున్నా.. ధర తెలిస్తే షాకేనని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

హెర్మ్స్ లగ్జరీ కంపెనీకి ఆ టీ-షర్ట్ కాస్ట్.. అక్షరాలా రూ.1,50,000 అంట. దీంతో అది తెలిసి కొందరు నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మహేష్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేనని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు మహేష్ బాబు.. తన సింపుల్ టీ షర్ట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారని చెప్పడంలో నో డౌట్.

ఇక సినిమాల విషయానికొస్తే.. చివరగా గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళితో వర్క్ చేస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్ లో రూపొందుతున్న SSMB 29 ప్రాజెక్ట్ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కానీ ఇప్పటి వరకు జక్కన్న ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

అయితే సినిమాలో నెవ్వర్ బిఫోర్ లుక్ లో మహేష్ కనిపించనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన మేకోవర్ అయినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. జిమ్ లో కంటిన్యూ వర్కౌట్లు చేస్తున్నట్లు సమాచారం. లాంగ్ హెయిర్, ప్యాక్ బాడీతో మహేష్ కొంతకాలంగా కనిపిస్తున్నారు. మరి SSMB 29 షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.