అంతర్జాతీయ ఐకన్‌తో మహేష్ ఫ్యామిలీ రేర్ క్లిక్
ఇటీవల అమెరికాలో నిక్ జోనాస్ షోని వీక్షించేందుకు వెళ్లిన నమ్రత శిరోద్కర్, గౌతమ్, సితార ఆ సమయంలో నిక్ జోనాస్ తో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.
By: Tupaki Desk | 18 April 2025 5:39 AMఓవైపు ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో షూటింగులతో బిజీగా ఉన్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ మూవీ SSMB29లో పీసీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రియాంక చోప్రా కెరీర్ బెస్ట్ కాబోతోందనే అంచనా ఉంది. ఇలాంటి సమయంలో ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ తో మహేష్ కుటుంబ అనుబంధం ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ రూపంలో బయటపడింది.
ఇటీవల అమెరికాలో నిక్ జోనాస్ షోని వీక్షించేందుకు వెళ్లిన నమ్రత శిరోద్కర్, గౌతమ్, సితార ఆ సమయంలో నిక్ జోనాస్ తో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు. న్యూయార్క్ నగరంలో నిక్ జోనాస్ బ్రాడ్‌వే మ్యూజికల్ `ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్` ఈవెంట్లో ఈ అరుదైన అవకాశం మహేష్ ఫ్యామిలీకి లభించింది. నిక్ అద్భుత ప్రదర్శన వీక్షించే అవకాశం కల్పించినందుకు నమ్రత తన కృతజ్ఞతలు కూడా తెలిపారు.
ప్రస్తుతం ఈ అరుదైన ఫోటోగ్రాఫ్ మహేష్ అభిమానుల్లో వైరల్‌గా షేర్ అవుతోంది. గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ కుటుంబంతో అనుబంధం మహేష్ బాబును, అతడి పిల్లలను హాలీవుడ్ కి తీసుకెళుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇటీవలి కాలంలో మన తెలుగు స్టార్లు దేశవ్యాప్తంగా ఉన్న స్టార్లతో, ఫిలింమేకర్స్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ లో ఈ ఒరవడి మరింత విస్త్రతమైంది. ఇప్పుడు మహేష్ హాలీవుడ్ తో సత్సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు పెద్ద స్టార్లు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ తో సత్సంబంధాలను కొనసాగించడం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. గ్లోబల్ ఐకాన్స్ తో మహేష్ ఏదైనా అంతర్జాతీయ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తారేమో చూడాలి.