సూపర్ స్టార్ పై శ్రీలంక ఎయిర్‌లైన్స్ పోస్ట్
ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అలానే వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా మహేష్ బాబు శ్రీలంక ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ లో కొలంబోకు వెళ్తూ కనిపించారు.
By: Tupaki Desk | 22 July 2025 3:38 PM ISTసినీ సెలబ్రిటీలు ఏం చేసినా, ఎక్కడ కనిపించినా సెన్సేషనే. వారికుండే క్రేజ్ అలాంటిది. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అలానే వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా మహేష్ బాబు శ్రీలంక ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ లో కొలంబోకు వెళ్తూ కనిపించారు. క్యాజువల్ గ్రీన్ కలర్ పుల్ ఓవర్, వైట్ ప్యాంట్, క్యాప్, కళ్లద్దాలు పెట్టుకుని చాలా స్టైలిష్ గా దర్శనమిచ్చారు మహేష్.
అయితే ఇక్కడ మహేష్ కొలంబో వెళ్ళడం కంటే అతను దిగిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఫ్లైట్ లోని స్టాఫ్ తో కలిసి మహేష్ బాబు ఫోటోకు పోజులివ్వగా, ఆ ఫోటోను ఎయిర్‌లైన్ స్వయంగా తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ను తమ ఫ్లైట్ లో కలిగి ఉండటం తమకెంతో గౌరవంగా ఉందంటూ ఎయిర్‌లైన్స్ పోస్ట్ చేసింది.
ఫ్లైట్ లోని క్యాబిన్ టీమ్ మహేష్ బాబు తో కలిసి దిగిన ఈ ఫోటోలో మహేష్ ఎప్పటిలానే చాలా అందంగా కనిపించారు. మొత్తానికి సూపర్ స్టార్ రాకతో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29 కు సంబంధించిన పనుల్లోనే టీమ్ మొత్తం బిజీగా ఉన్నారు.
అయితే మహేష్ బాబు సడెన్ గా కొలంబో వెళ్లడంపై ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ కొంతమంది మాత్రం మహేష్ లొకేషన్ల వేట కోసం వెళ్తున్నారని అంటుంటే ఇంకొందరు మాత్రం ప్రొడక్షన్ కు సంబంధించిన మీటింగ్ కోసమని అంటున్నారు. ఏదేమైనా మహేష్ బాబు కొలంబో ఫ్లైట్ లో కనిపించడం మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ అయిపోయింది.
