మహేష్ కొలంబో ట్రిప్ అందుకేనా
ఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు కొలంబో వెళ్లడం అందరినీ మరోసారి ఆలోచింపచేసింది.
By: Tupaki Desk | 22 July 2025 3:38 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఏ సమాచారమైనా ఇప్పుడు వెంటనే వైరల్ అవుతుంది. దానికి కారణం ఆయన దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తుండటమే. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి వివరాలను వెల్లడించింది లేదు. అయినప్పటికీ ఎస్ఎస్ఎంబీ29పై భారీ బజ్ నెలకొంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా మహేష్ బాబు కొలంబో వెళ్లడం అందరినీ మరోసారి ఆలోచింపచేసింది.
మహేష్ కొలంబో వెళ్లడం వెనుక కారణాలేంటని అందరూ ఆలోచిస్తుండగా దానికి సంబంధించి స్పష్టత తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ కొలంబో వెళ్లింది వెకేషన్ కోసమని, సినిమా కోసం కాదని తెలుస్తోంది. తన కూతురు సితార బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి మహేష్ హాలీడేకు వెళ్లారని సమాచారం. వెకేషన్ నుంచి తిరిగి రాగానే మహేష్ ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో పాల్గొననున్నారట.
ఇప్పటికే మహేష్ ఈ సినిమా కోసం భారీ మేకోవర్ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఎస్ఎస్ఎంబీ29 సినిమా ఆగస్ట్ నుంచి కీలక షెడ్యూల్ మొదలవుతుందని, చిత్ర యూనిట్, సినిమాలోని ప్రధాన తారాగణం మొత్తం దాని కోసం వెయిట్ చేస్తున్నారని, సినిమాలోని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
అందులో భాగంగానే ఈలోగా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి శ్రీలంక టూర్ కు వెళ్లారు. ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ తిరిగి ఆగస్ట్ లో మొదలవనున్నందున ఆ షెడ్యూల్ కోసం ప్రియాంక చోప్రా కూడా తన డేట్స్ ను అడ్జస్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
