స్మార్టెస్ట్ CEO ఆఫ్ టాలీవుడ్.. రియల్ బిజినెస్‌మేన్
మహేష్ బాబు ఈ స్థాయికి ఎదగడంలో ఆయన భార్య, నమ్రతా శిరోద్కర్ పాత్ర అత్యంత కీలకం.
By: Sivaji Kontham | 14 Feb 2026 11:00 PM ISTసూపర్‌స్టార్ మహేష్ బాబు కేవలం వెండితెర ప్రిన్స్ మాత్రమే కాదు.. సొంత వ్యాపార సామ్రాజ్య నిర్మాణంలోనూ తనదైన ముద్ర వేస్తూ `టాలీవుడ్ స్మార్టెస్ట్ CEO`గా నీరాజనాలు అందుకుంటున్నారు. మహేష్ బాబు బిజినెస్ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలంటే, ఆయనలోని `రియల్ బిజినెస్‌మేన్`ని టచ్ చేయాలంటే డీప్ గా మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.
టాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న మహేష్ బాబు ఆఫ్ ద స్క్రీన్ బిజినెస్‌మేన్ గా వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నారు. ఒక పక్కా కార్పొరేట్ స్టైల్ బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. కేవలం సినిమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్‌పైనే ఆధారపడకుండా ప్యాసివ్ ఇన్‌కమ్ మోడల్‌ను అనుసరిస్తూ తన ఆస్తుల విలువను రూ. 1000 కోట్లకు పైగా పెంచుకోవడంలో సక్సెస్ అయ్యారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ స్టూడియోస్ సహా సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మించి విజయాల్ని అందుకున్నారు. ఇప్పుడు దానికి మించి బిజినెస్ మెళకువలతో మహేష్ దూసుకెళుతున్నారు. ఒక హీరోగా మాత్రమే కాకుండా ఒక దార్శనికత కలిగిన ఇన్వెస్టర్‌గా అతడు ఎదుగుతున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది.
మహేష్ బాబు అనుసరించే ప్రధాన వ్యాపార సూత్రం.. మనం నిద్రపోతున్నప్పుడు కూడా ఆదాయం వచ్చే మార్గాలను వెతకడం. ఈ క్రమంలోనే అతడు AMB సినిమాస్ వంటి లగ్జరీ సూపర్‌ప్లెక్స్‌ను నిర్మించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఆసియన్ గ్రూప్‌తో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌళి లో ప్రారంభించిన ఈ మల్టీప్లెక్స్ కేవలం టికెట్ అమ్మకాలపైనే కాకుండా, హై మార్జిన్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ద్వారా భారీ ఆదాయాన్ని గడిస్తోంది. 2026 నాటికి ఈ బ్రాండ్‌ను బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు విస్తరిస్తూ ఒక బలమైన రిటైల్ ఇన్‌కమ్ అసెట్‌గా మార్చేశారు.
సినిమా నిర్మాణ రంగంలోనూ జీఎంబి ఎంటర్ టైన్ మెంట్ ని విజయవంతంగా నడిపిస్తున్నారు. తను నటించే సినిమాల్లో కేవలం హీరోగానే కాకుండా భాగస్వామిగా ఉంటూ.. ఐపీ రైట్స్, నాన్-థియాట్రికల్ రెవెన్యూ, మ్యూజిక్ షేర్ల ద్వారా లాభాలను పొందుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో క్యాష్ ఫ్లో పెంచుకుంటూనే `మేజర్` వంటి కంటెంట్ డ్రివెన్ చిత్రాలతో తన బ్రాండ్ వాల్యూను జాతీయ స్థాయిలో పటిష్టం చేసుకుంటున్నారు.
మహేష్ బాబు కేవలం సినిమాలకు పరిమితం కాకుండా స్టార్టప్స్, ఫ్యాషన్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. కోవిడ్ వెళ్లిన తర్వాత హెల్త్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని `ఫిట్ డే` వంటి న్యూట్రిషన్ స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేసారు. మింత్రా భాగస్వామ్యంతో `ది హంబుల్ కో` వంటి క్లోతింగ్ బ్రాండ్‌ను సక్సెస్ చేయడంలోను ఆయన బిజినెస్ దూరదృష్టి ప్రూవైంది. అటు ఫిట్నెస్, ఇటు ఫ్యాషన్.. ఇలా అన్ని రంగాల్లోను రిస్క్ అండ్ గ్రోత్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు.
మహేష్ బాబు ఈ స్థాయికి ఎదగడంలో ఆయన భార్య, నమ్రతా శిరోద్కర్ పాత్ర అత్యంత కీలకం. బ్రాండ్ డీల్స్ నుంచి బిజినెస్ నిర్ణయాల వరకు సహచరి వెనుక ఉండి నడిపిస్తూ మహేష్ బాబును ఒక గ్లోబల్ బ్రాండ్‌గా నిలబెట్టారు. సామాజిక సేవ, కుటుంబ విలువలు, తిరుగులేని బిజినెస్ స్ట్రాటజీలతో మహేష్ బాబు టాలీవుడ్‌లో రియల్ సూపర్‌పవర్ అనిపించుకుంటున్నారు.
మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న వారణాసి 2027లో విడుదల కానుంది. ఈ సినిమా అతడిని పాన్ వరల్డ్ హీరోగా ఆవిష్కరించనుంది. నిజానికి మహేష్ 50-80 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. అయితే `వారణాసి` రెమ్యూనరేషన్ విషయంలో మహేష్ బాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మునుపెన్నడూ లేని విధంగా జీరో రెమ్యూనరేషన్ - ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో అతడు పారితోషికం అందుకుంటున్నాడు. కానీ రాజమౌళి సినిమా బడ్జెట్ దాదాపు 1,000 -1,300 కోట్లు కావడంతో నిర్మాతపై భారం పడకూడదని మహేష్ బాబు ఒక రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని సమాచారం.రెమ్యూనరేషన్‌కు బదులుగా ఆయన సినిమా లాభాల్లో వాటా తీసుకోబోతున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకుంటే మహేష్ బాబుకు వాటా రూపంలో కనీసం రూ.150 - రూ.200 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే ఒక హీరోకు అందే అత్యధిక పారితోషికం కావచ్చని అంచనా.
మహేష్ బాబు కేవలం డబ్బు కోసం కాకుండా, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే `విజన్`తో ఈ ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌ను ఎంచుకున్నారు. ఇది ఆయనను ఒక `స్మార్ట్ ఇన్వెస్టర్`గా మరోసారి నిరూపించింది.
