వైజాగ్ లో మహేష్ ఏఎంబీ సినిమాస్!
సూపర్ స్టార్ మహేష్ - ఏషియన్ సినిమాస్ జాయింట్ వెంచర్‌గా ఏఎంబీ సినిమాస్ ఇండియా వైడ్ ఎలా విసర్తిస్తుందో చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 9 March 2026 1:53 PM ISTసూపర్ స్టార్ మహేష్ - ఏషియన్ సినిమాస్ జాయింట్ వెంచర్‌గా ఏఎంబీ సినిమాస్ ఇండియా వైడ్ ఎలా విసర్తిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్ లో మొదలైన ఏఏంబీ దేశ వ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది.
ఇప్పటికే గచ్చిబౌలి ,కొండాపూర్ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన ఏఏంబీ సినిమా అండ్ మాల్ రన్నింగ్ లో ఉంది. ఏడు స్క్రీన్లతో ప్రారంభమైన ఈ మాల్, హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోనే ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. ఇటీవలే బెంగుళూరు గాంధీనగర్ లో ఏఎంబీ సినిమాస్ అధికారికంగా లాంచ్ అయింది.
కాపాళీ థియేటర్ స్థానంలో దీన్ని నిర్మించారు. తొమ్మిది స్క్రీన్లతో కూడిన అత్యాధునిక మల్టీప్లెక్స్ ఇది. దక్షిణ భారతదేశంలోనే మొదటి డాల్బీ సినిమా స్క్రీన్‌ను జనవరి లో లాంచ్ చేసారు. ఫిబ్రవరిలో మహేష్ స్వయంగా ఈ మాల్‌ను సంద ర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏఎంబీ క్లాసిక్ పేరుతో 7 స్క్రీన్ల ప్రీమియం మల్టీప్లెక్స్ పనులు జరుగుతున్నాయి. మే లేదా జూన్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే బెంగళూరు ఎయిర్‌పోర్ట్ సమీపంలో మరో మల్టీప్లెక్స్ నిర్మించే ఆలోచనలో ఏషియన్ సినిమాస్ పనిచేస్తోంది.
ఇంకా గోవా, కేరళ లాంటి రాష్ట్రాల్లో కూడా ఏఎంబీ సినిమాస్ ను ప్రారంభించాలనే ఆలోచనలో మహేష్ ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ పట్టణంలో కూడా ఓ భారీ మాల్ కం మల్టీప్లెక్స్ ను నిర్మించాలనే చర్చ మహేష్-ఏషియన్ సంస్థల మధ్య జరిగినట్లు తెరపైకి వచ్చింది. ఏపీ రాజధాని అంశం పక్కన బెడితే? వాణిజ్య రాజధానిగా ఇప్పటికే విశాఖకు పేరుంది. విశాఖ అభివృద్ది నిరంతరం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఏఏ సినిమాస్ ను విశాఖలో ప్రారంభించారు. ప్రస్తుతం బిల్డింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
ఇనార్బిట్ మాల్ నిర్మాణం కూడా ముగింపు దశకు చేరుకుంది. త్వరలో విశాఖలో మెట్రో పనులు కూడా మొదలు కాన్నాయి. దీంతో ఏఎంబీ సినిమాస్ ను కూడా విశాఖలో ప్రారంభించాలనే ఆలోచనలో మహేష్ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. గోవా, కేరళతో పాటు విశాఖ ప్రాజెక్ట్ ను కూడా మొదలు పెడితే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. ఇలా ఏఎంబీ సినిమాస్ దక్షిణాది రాష్ట్రాల ను భారీగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మెట్రో పాలిటిన్ సిటీస్ టార్గెట్ గా మాల్స్ లాంచ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో తిరుపతి, విజయవాడ, కాకినాడ, రాజమండి లాంటి పట్టణాల్లో కూడా ఏఏఎంబీ సినిమాస్ విస్తరించే అవకాశాలు లేకపోలేదు.
