Begin typing your search above and press return to search.

మ‌హేష్‌-బ‌న్నీల్లో ముందొచ్చేది ఎవ‌రు?

ఇండియాస్ మెస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లుగా ఎస్ ఎస్ ఎంబీ 29- ఏఏ 22 చిత్రాలు హైలైట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 May 2025 11:40 AM
మ‌హేష్‌-బ‌న్నీల్లో ముందొచ్చేది ఎవ‌రు?
X

ఇండియాస్ మెస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లుగా ఎస్ ఎస్ ఎంబీ 29- ఏఏ 22 చిత్రాలు హైలైట్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ పై అంచ నాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్ప‌టికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్త‌యింది. ఈ సినిమా పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ నే షేక్ చేస్తుంద‌నే అంచ‌నాలున్నాయి. అటు ఐకాన్ స్టార్ 22 సెట్స్ కు వెళ్ల‌క‌ముందే భారీ అంచ‌నాలు నెల‌కొంటున్నాయి.

'జ‌వాన్' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అట్లీ టేక‌ప్ చేసిన ప్రాజెక్ట్ కావ‌డంతో అంచ‌నాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడీ రెండు సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా. ఎస్ ఎస్ ఎంబీ 29 రిలీజ్ ఏడాదిని రాజ‌మౌళి ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఎలా లేద‌న్నా ఏడాదిన్న‌ర త‌ర్వాతే ఆ సినిమా రిలీజ్ ఉండే అవ‌కాశం ఉంది. ఇంకా అంత‌కు మించే స‌మ‌యం తీసుకునే ఛాన్స్ ఉంది.

బ‌న్నీ చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదు. ఈ సినిమా మ‌హేష్ కి పోటీగా ఎలా అంటారా? అట్లీ నుంచి రిలీజ్ అయిన సినిమా లేవి ఇంత వ‌ర‌కూ డిలే కాలేదు. చెప్పిన స‌మ‌యానికే రిలీజ్ అయ్యాయి. అట్లీ వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేస్తాడు. అయితే అవ‌న్నీ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు కాబ‌ట్టి సాధ్య‌మైంది. కానీ బ‌న్నీ సినిమా టెక్నిక‌ల్ అంశాల‌తోనూ ముడి ప‌డి ఉంది. అలాంట‌ప్ప‌డు స‌మయం కూడా ఎక్కువ‌గానే ప‌డుతుంది.

ఇప్పుడెలా సాధ్య‌మంటే? అట్లీ ప్రారంభానికి ముందే ఓ ప్ర‌ణాళిక‌తో రంగంలోకి దిగాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ నుంచే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి సంబంధించిన ప‌నుల కోసం హాలీవుడ్ స్టూడియోల‌తో సంప్ర‌దింపులు జ‌రుపు తున్నాడు. ఇవ‌న్నీ అడ్వాన్స్డ్ సీజీ వ‌ర్క్ స్టూడియోలు. చాలా వేగంగా ప‌నులు పూర్తి చేసే సామ‌ర్ధ్యం వాటి సొంతం. అట్లీ ఎలాంటి క‌థ తీసుకున్నా? ఏడాదిర్న‌ర లో సినిమా రిలీజ్ చేస్తాడు? అన్న కాన్పిడెన్స్ క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ సినిమా ముందుగా రిలీజ్ అవుతుందా? బ‌న్నీ చిత్రం రిలీజ్ అవుతుందా? ప్ర‌చారం మొద‌లైంది.