# ఎస్ ఎస్ ఎంబీ 30 ఛాన్స్ వీళ్లకే!
ఈ నేపథ్యంలో మహేష్ 30వ సినిమా దర్శకుడు ఎవరు? అవుతారు అన్నది ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 8 May 2025 9:30 AM# ఎస్ ఎస్ ఎంబీ 29 తర్వాత సూపర్ స్టార్ మహేష్ గ్లోబల్ స్టార్ గా అవతరిస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. హాలీవుడ్ కటౌట్ కి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ-రాజమౌళి మేకింగ్ మిక్సైతే ఎలా ఉంటుందో ప్రత్యే కంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా కాదు ...పాన్ వరల్డ్ ఆశ్చర్యోయేలా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రాల్లో ఇదో వండర్ కాబోతుంది అన్న అంచనాలు అందరిలోనూ బలంగా ఉన్నాయి.
ఈ సినిమా విజయంతో ఇండియన్ సినిమా మార్కెట్ రూపు రేఖలే మారిపోతాయని ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఈ సక్సెస్ అనంతరం మహేష్ రీజనల్ సినిమాలు చేసే అవకాశం ఉండదు. పాన్ ఇండియా...పాన్ వరల్డ్ అంటూ పెద్ద పెద్ద చిత్రాలవైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ 30వ సినిమా దర్శకుడు ఎవరు? అవుతారు అన్నది ఇప్పటి నుంచే ఆసక్తికరంగా మారింది.
మరి ఆ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి రేసులో ఉన్నది ఎవరంటే? ప్రముఖంగా ముగ్గురు...నలుగురు దర్శకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సందీప్ రెడ్డితో ఇప్పటికే ఓ సినిమా తీయాలి మహేష్. కానీ అది సాద్యప డలేదు. `యానిమల్` తో తానేంటో ప్రూవ్ అయ్యాడు కాబట్టి సందీప్ విషయంలో స్టోరీ నచ్చితే గనుక మహేష్ నో చెప్పే ఛాన్స్ ఉండదు. అలాగే `పుష్ప` తో సుకుమార్ పాన్ ఇండియాలో ఓ సంచలనం అయ్యారు.
గతంలో మహేష్ `వన్` సినిమా కోసం సుక్కుతో పనిచేసినా? అది సరైన ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత ఇద్దరు మరో అటెంప్ట్ చేయలేదు. కానీ సుకుమార్ ఎంతటి ప్రతిభా వంతుడన్నది మహేష్ కి తెలుసు. `పుష్ప` సక్సెస్ సుకుమారు క్రియేటివిటీతో స్టోరీ నచ్చితే 30వ చిత్రం అదే కావొచ్చు. అలాగే రెండవ చిత్రం తోనే ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నే లాక్ చేసిన బుచ్చిబాబు కూడా ఈ లైన్ లో ఉన్నాడు.
ఇంకా అనూహ్యంగా ప్రభాస్ తో `పౌజీ` పట్టాలెక్కించి షాక్ ఇచ్చాడు హను రాఘవపూడి. ఇతడు మంచి క్రియే టివ్ డైరెక్టర్. అందుకే డార్లింగ్ బిజీ షెడ్యూల్ సైతం పక్కనబెట్టి `పౌజీ`కి డేట్లు ఇచ్చాడు. సరైన కథతో మహేష్ ని అప్రోచ్ అయితే హనుకు ఛాన్స్ ఉంది. ఇలా ముగ్గురు...నలుగురు మహేష్ లైన్ లో కనిపిస్తున్నారు.