ఆ మూడు రిలీజ్లకు అదే మాట!
తెలుగు ప్రేక్షకుల నోట ఇప్పుడు మహావతార్ మాటే వినిపిస్తుంది. సనాతన ధర్మం పరిరక్షణ కొరకై అంటూ జనాలంతా మాట్లాడుకుంటున్నారు.
By: Tupaki Desk | 5 Aug 2025 12:00 AM ISTఇటీవలే పాన్ ఇండియాలో రిలీజ్ అయిన `మహావతార్ నరసింహ` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. రిలీజ్ అయి పది రోజులు గడిచినా ఇప్పటికీ థియేటర్లు హౌస్ పుల్ అవుతున్నాయి. ఇప్పటికే చిత్రం వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. మహాభారతం, భాగవతం కాన్సెప్ట్ ఆధారంగా యానిమేషన్ పాత్రలతో ప్రేక్షకులకు కనెక్ట్ చేయడంలో మేకర్స్ వంద శాతం సక్సెస్ అయ్యారు. సాధారణంగా ఇలాంటి కాన్సెప్ట్ ని యానిమేషన్ గా రూపొందించి రిలీజ్ చేయడం అన్నది పెద్ద సాహసమే.
బోర్ కొట్టని కంటెంట్
ఎందుకంటే ఇలాంటి చిత్రాలకు ఆదరణ తక్కువగా ఉంటంది. చిన్న పిల్లలే ఇలాంటి చిత్రాలకు కనెక్ట్ అవుతారు ? అన్న మాటను మహావతార్ నరసింహ బ్రేక్ చేసింది. కంటెంట్ ఉంటే ? కటౌట్ తో పనిలేదు అన్నట్లు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కనెక్ట్ అయింది. హిందు ధర్మం కాన్సెప్ట్ ను ఎంతో తెలివిగా కనెక్ట్ చేసారు. తీసుకున్న పాత్రల్లో గొప్ప ఎమోఎషన్ పండించడంతోనే ఇది సాధ్యమైంది. రెండు న్నర గంటల పాటు ఎలాంటి బోర్ పీల్ అవ్వకుండా కథాంశాన్ని ఎంతో ఎంగేజింగ్ గా చెప్పారు.
ఆ సినిమాపైనా అదే అంచనా
తెలుగు ప్రేక్షకుల నోట ఇప్పుడు మహావతార్ మాటే వినిపిస్తుంది. సనాతన ధర్మం పరిరక్షణ కొరకై అంటూ జనాలంతా మాట్లాడుకుంటున్నారు. మరి ఇదే మాట అప్ కమింగ్ రిలీజ్ విషయంలోనూ బలంగా విని పించే అవకాశం ఉంది. ఇంతకీ ఏంటా సినిమాలంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే. నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను `అఖండ`కు సీక్వెల్గా `అఖండ 2` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా హిందు ధర్మం శివుడి కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. శివుడి పాత్ర స్పూర్తితోనే బోయపాటి బాలయ్య పాత్రను తనదైన ట్రీట్ మెంట్ తో తీర్చి దిద్దుతున్నాడు.
ఉత్తరాదిన బాలయ్య మార్క్
ప్రత్యేకించి ఈ సినిమాపై ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ అంచనాలున్నాయి. `అఖండ`తోనే బాలయ్య నార్త్ కి కనెక్ట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడ అంచనాలను దృష్టిలో పెట్టుకుని పాత్రను ఆద్యంతం ఆసక్తికరంగా మలుస్తున్నారు. మరోవైపు కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయా దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న `కాంతార 2`పైనా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. హిందు దేవతల కాన్సెప్ట్ ఆధారంగానే తెర కెక్కుతోంది. దైవ నృత్యం - భూత కోలం , స్థానిక దేవతల గురించిన కాన్సెప్ట్ ఇది. వాటికి సంబంధించి వివిధ ఆహార్యాల్లో రిషబ్ శెట్టి కనిపించనున్నాడు. దీంతో ఆ పాత్రలు ఎలా ఉంటాయి? అన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
తెలిసిన రామాయణం చెప్పేదెలా!
అలాగే బాలీవుడ్ లో నితిష్ తివారీ ప్రతిష్టాత్మకంగా `రామాయణ్` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రామా యణం అంటే ప్రజలందరికీ తెలిసిన కథ. దీంతో ఆ కథను నితీష్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు? రామా యణంలో పాత్రలను ఎలా ఆవిష్కరించబోతున్నారు? అన్నదే హాట్ టాపిక్. ఈ జనరేషన్ యువతకు రామాయణాన్ని ఎలా కనెక్ట్ చేస్తారు? అన్నది మరో ఇంట్రెస్టింగ్ అంశం. అలా ఈ మూడు చిత్రాలు హిందు ధ ర్మం తో ముడిపడిన చిత్రాలగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో జనాలు వాటి గురిం చి చర్చించడం ఎక్కువైంది. ఈ మూడు చిత్రాలు 2025-26 లో రిలీజ్ కానున్నాయి.
