మహావతార.. ఒక్కటి కాదు చాలా
ఈ మధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సర్ప్రైజుల్లో ‘మహావతార నరసింహ’ ఒకటి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ యానిమేషన్ మూవీని రిలీజ్ ముంగిట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
By: Tupaki Desk | 28 July 2025 6:00 PM ISTఈ మధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సర్ప్రైజుల్లో ‘మహావతార నరసింహ’ ఒకటి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ యానిమేషన్ మూవీని రిలీజ్ ముంగిట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కన్నడలో కూడా బజ్ తక్కువగానే ఉంది. కానీ రిలీజ్ రోజు అనూహ్యంగా మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. సాయంత్రానికి మంచి ఆక్యుపెన్సీలతో ఆశ్చర్యపరిచింది. ఇక రెండో రోజు నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమాకు స్క్రీన్లు, షోలు పెరిగిపోయాయి. వసూళ్ల గురించైతే చెప్పాల్సిన పని లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు అటు ఇటుగా స్క్రీన్లలో రిలీజైన సినిమా కాస్తా.. ఇప్పుడు ఐదారొందల స్క్రీన్లలో నడుస్తోందంటే దీనికి వస్తున్న స్పందన ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మనకు బాగా పరిచయం ఉన్న ‘భక్త ప్రహ్లాద’ కథనే యానిమేషన్లో, లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుని గ్రాండ్‌గా తీసింది అశ్విన్ కుమార్ బృ:దం. దీంతో ఈ సినిమాతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్‌తో పాటు డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్లందరూ భారీ లాభాలే అందుకుంటున్నారు.
ఈ యానిమేషన్ మూవీ మీద హోంబలే వాళ్లకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే.. ఇదే తరహాలో ఇంకో ఆరు సినిమాలకు ఇప్పటికే ప్రణాళికలు వేశారు. ఇప్పుడు మహా విష్ణువు నరసింహావతారం నేపథ్యంలో సినిమా తీసిన మేకర్స్.. విష్ణువు వేరే అవతారాల మీద కూడా ఇంకో అరడజను సినిమాలు చేయడానికి ప్లాన్ చేశారు.
మహావతార పరశురామ్,
మహావతార రఘునందన్,
మహావతార ద్వారకాదీశ్,
మహావతార గోకులనంద,
మహావతార కల్కి-1,
మహావతార కల్కి-2..
ఇలా ఇంకో ఆరు సినిమాలు రాబోతున్నాయి.
‘మహావతార పరశురామ్’ 2027లో విడుదల కాబోతోంది. ఆ తర్వాత రెండేళ్లకు ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేశారు. వీటి మీద భారీ బడ్జెట్ పెట్టబోతున్నారు. ‘మహావతార నరసింహ’ అద్భుత విజయం దిశగా దూసుకెళ్తుండడంతో మిగతా చిత్రాలను మరింత గ్రాండ్‌గా తీయడానికి ఉత్సాహంగా సిద్ధం కానుంది హోంబలే ఫిలిమ్స్. ఇది ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ యానిమేషన్ ఫ్రాంఛైజీగా మారడం ఖాయం.