Begin typing your search above and press return to search.

మహావతార్ నరసింహా ట్రైలర్..!

మహావతార్ నరసిం హా ట్రైలర్ తో బ్రహ్మ వరం పొందిన హిరణ్యకశ్యపుడి ఎదుట నరసింహ నామంతో నిలబడతాడు ప్రహ్లాదుడు.

By:  Tupaki Desk   |   9 July 2025 8:15 PM IST
మహావతార్ నరసింహా ట్రైలర్..!
X

సిల్వర్ స్క్రీన్ పై పురాణ ఇతిహాసాలు తెలిపే విషయంలో సినీ మేకర్స్ ఎప్పుడు ముందుంటారు. ఈమధ్య ఆధ్యాత్మిక సినిమాలకు కథలను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వాటి ద్వారా మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఈ క్రమంలో పాన్ ఇండియా రేంజ్ లో భారీ సినిమాలు చేస్తున్న హోంబలే బ్యానర్ నుంచి ఒకేసారి ఐదు సినిమాలు రానున్నాయి. ఈ సినిమాలు అన్నీ కూడా యానిమేషన్ రూపంలో వస్తున్నాయి.

ఈ సినిమాల్లో మొదటిది మహావతార్ నరసింహా ముందు రిలీజ్ చేస్తున్నారు. మహావతార్ నరసింహా ట్రైలర్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. హోంబలే ప్రొడక్షన్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

మహావతార్ నరసిం హా ట్రైలర్ తో బ్రహ్మ వరం పొందిన హిరణ్యకశ్యపుడి ఎదుట నరసింహ నామంతో నిలబడతాడు ప్రహ్లాదుడు. ఆ టైంలో హిరణ్యకశ్యపుడు కోపోద్రక్తుడై ప్రహ్లాధున్ని శిక్షిస్తాడు. ప్రహ్లాద భక్తికి మెచ్చిన నారాయణుడు నర సింహావతారం లో ప్రత్యక్షమై హిరణ్యకశ్యపుడిని అంతం చేస్తాడు.

నర సింహావతారమైన ఈ కథనే మరోసారి తెర మీద అద్భుతమైన విజువల్స్ తో చూపించనున్నారు. ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఐతే యానిమేషన్ సినిమా కాబట్టి ఆడియన్స్ ని ఎంతవరకు రీచ్ అవుతుంది అన్నది చూడాలి. ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నారు. హోంబలె బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి మహావతార్ నరసిం హా కూడా భారీ రిలీజ్ ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

తెలిసిన కథ అయినా కూడా తెర మీద ప్రేక్షకుడిని మెప్పించేలా చేస్తే అద్భుతాలు చేయొచ్చు. ప్రహ్లాదుడి కథ అందరికీ తెలుసు.. ఐతే సిల్వర్ స్క్రీన్ పై ఈ కథను విజువల్ వండర్ గా చెబుతున్నారు. అందుకే మహావతార్ నరసిం హా మీద ఎక్కువ బజ్ ఏర్పడింది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది కాబట్టి సినిమా జనాలకు నచ్చితే మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది.