మహావతార్: నరసింహ.. బుజ్జి ప్రహ్లాదుడిని చూశారా?
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 4 July 2025 11:00 PM ISTప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కేజీయఫ్, కాంతార, సలార్ తదితర చిత్రాలను ప్రేక్షకులను అందించిన హోంబలే ఫిల్మ్స్.. ఇప్పుడు క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ను మొదలుపెట్టింది.
శ్రీమహా విష్ణువు దశావతారాలను పురాణ గాథ రూపంలో యానిమేటెడ్ ఫ్రాంచైజీగా తీసుకురానుంది. అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్ తో నెవ్వర్ బిఫోర్ సినిమాటిక్ స్కేల్ తో చిత్రాలను యూనివర్స్ లో తీయనుంది. అందులో భాగంగా ఇప్పుడు.. తొలి చిత్రం మహావతార్: నరసింహను రూపొందిస్తోంది.
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్నారు. జులై 25వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో అత్యాధునిక 3D ఫార్మాట్ లో సినిమా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మేకర్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.
సినిమాలో పాత్రలను పరిచయం చేస్తూ వీడియోస్ ను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా హిరణ్య కశిపుడి పాత్రను పరిచయం చేశారు. అత్యాధునిక వీఎఫ్ ఎక్స్, 3డీ విజువల్స్ , పవర్ ఫుల్ బీజీఎంతో గ్లింప్స్ అయితే అదిరిపోయింది. తాజాగా ప్రహ్లాదుడి పాత్రకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
అయితే రధంలో ప్రహ్లాదుడు వస్తున్న విజువల్స్ తో తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ స్టార్ట్ అయింది. అప్పుడే.. నీ వంటి పరమ భక్తులు అనంతమైన కాలచక్రంలో ఒకసారే జన్మిస్తారు. నిన్న ప్రత్యక్షంగా దర్శంచి ధన్యుడయ్యా.. కచ్చితంగా ఏదో ఒక దివ్యశక్తి బాలుడిని కాపాడుతుంది.. అంటూ బ్యాక్ గ్రౌండ్ లో పవర్ ఫుల్ డైలాగ్ వస్తుంది.
ఆ తర్వాత ఒకే నామం మన జీవితంలో ఉన్న కష్టాలకు సమాధానం.. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ప్రహ్లాదుడు విష్ణువుపై తన భక్తిని చాటుకుంటారు. ప్రహ్లాదుడు మాటలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రోమో అద్భుతమైన విజువల్స్ తో అదిరిపోయింది. వీఎఫ్ ఎక్స్ వర్క్ వేరే లెవెల్ ఉండగా.. 3డీ విజువల్స్ మెప్పిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్. మొత్తానికి ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ సందడి చేస్తోంది.