Begin typing your search above and press return to search.

ఆ రెండింటికి మహావతారమే సమాధానం- వాళ్లు ఇప్పటికైనా కళ్లు తెరవాలి

ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో ఒక్కో షోకు సుమారు 40వేల టికెట్లు సేల్ అవుతున్నాయంటే ఈ సినిమా ప్రభంజనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

By:  Tupaki Desk   |   10 Aug 2025 1:49 AM IST
ఆ రెండింటికి మహావతారమే సమాధానం- వాళ్లు ఇప్పటికైనా కళ్లు తెరవాలి
X

ఓటీటీలు వచ్చాక థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గుతుందన్నది వాస్తవం. అంతేకంటే పెద్ద సమస్య టికెట్ ధరలు. ఇక మల్టీపెక్సుల్లో కూల్ డ్రింక్స్, స్నాక్స్ ధరలు అయితే చుక్కలు చూపిస్తాయి. ఈ కారణాల వల్ల సినిమాల థియేటర్లకు జనాలు వెళ్లడం తక్కువైపోయితోంది. అటు నిర్మాతలు కూడా కొంతమంది ఇదే ఫిక్స్ అయిపోయారు. కానీ, సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.

దానికి గతంలో అనేక సినిమాలు ఉదాహరణగా ఉండగా.. తాజాగా మహావతార్ నరసింహ కంటెంటే మ్యాటర్ అని రుజువు చేసింది. జులై చివరి వారంలో రిలీజైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో కంటెంట్ ఉండడం, టికెట్ రేట్లు కూడా అందుబాటు ధరల్లో ఉండడంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

రోజు రోజుకూ థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరగడం, ఎక్స్ షోలు పడడం జరుగుతుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో ఒక్కో షోకు సుమారు 40వేల టికెట్లు సేల్ అవుతున్నాయంటే ఈ సినిమా ప్రభంజనం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వీకెండ్ లేదు, హాలీడే లేదు, వర్కింగ్ డే లేదు. ఇలా ఏ రోజైనా సరే మూడు వారాల నుంచి మహావతార నరసింహ బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలకు సైతం పోటీ ఇస్తూ దూసుకుపోతోంది. ఎలాంటి ప్రమోషన్ల్ లేకుండా ఓన్లీ మౌత్ టాక్ తో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంమే కాదు.. ఇంకా కొనసాగుతుంది కూడా. ఒక్కో ఏరియాలో సాయంత్రం షో లు ఫుల్ అయిపోతున్నాయి. ఇలా దాదాపు మూడు వారాలు కంటిన్యూగా దాదాపు 70 శాతానికిపైగా ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఇలా రెస్పాన్స్ సాధించి, నిలకడగా ఆడిన సినిమా ఈ మధ్య కాలంలో ఏదీ లేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

పబ్లిసిటీ లేదు, హైప్ లేదు, ప్రమోషన్స్ లేకుండారి లీజైన ఈ సినిమా.. ఈ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడం గొప్ప విషయం. భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఒకే వారానికి ప్యాకప్ అవుతున్న ఈ రోజుల్లో నటులు లేకుండా కేవలం ఒక యానిమేషన్ సినిమా ఇన్ని వారాలు ఆడడం ఆశ్చర్యం కలిగించే అంశంమే. అంటే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టాలంటే.. ఒకటి సినిమాలో కంటెంట్ ఉండాలి. రెండు, టికెట్ ధర అందుబాటులో ఉండాలి. ఈ రెండే మహావతార సినిమా సక్సెస్ కు కారణం. అందుకే నిర్మాతలు కూడా ఓసారి ఆలోచించాలి. సినిమా విజయం సాధించాలంటే ఏం కావాలో అని.