సూపర్ హిట్ సీక్వెల్.. ఈసారేం చేస్తారో..?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నిథిలన్ స్వామినాథన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మహారాజ.
By: Tupaki Desk | 7 May 2025 11:30 PMమక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నిథిలన్ స్వామినాథన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మహారాజ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా అది. లాస్ట్ ఇయర్ లో అటు కమర్షియల్ హిట్ గానే కాదు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అదే రేంజ్ లో అందుకున్న సినిమా మహారాజ. ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించిన తీరు అందులో విజయ్ సేతుపతి యాక్టింగ్ దేనికదే ప్రత్యేకం అనిపించాయి. ఈ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకుంది.
ఐతే మహారాజ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న విజయ్ సేతుపతి, నిథిలన్ కాంబో ఈ మూవీ సీక్వెల్ కి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. కోలీవుడ్ మీడియా సమాచారం ప్రకారం నిథిలన్ స్వామినాథన్ మహరాజ సీక్వెల్ కథను సిద్ధం చేశాడట. ఆ కథ విజయ్ సేతుపతికి నచ్చేసిందని తెలుస్తుంది. త్వరలోనే సినిమా అనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు. విజయ్ సేతుపతి కథ నమ్మి చేసిన సినిమా కాబట్టే ప్రాజెక్ట్ అంత మంచి సక్సెస్ అయ్యింది.
మహారాజ సీక్వెల్ కథ ఎలా ఉంటుంది.. అందులో హీరో ఏం చేస్తాడన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఆడియన్స్ కూడా మహారాజ లాంటి సినిమాలు చూడాలని ఆశపడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కన్నా బెటర్ గా కథతో పాటు ఒక మంచి మెసేజ్ తో మహారాజ వచ్చింది. అంతేకాదు ఆడియన్స్ ని ఎమోషనల్ గా మెప్పించింది. అందుకే సినిమాను అంత పెద్ద హిట్ చేశారు. మహారాజ సినిమాను ఈమధ్యనే జపాన్ లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మహారాజ సీక్వెల్ అనగానే ఆ సినిమా లవర్స్ అంతా సూపర్ అనేస్తున్నారు. విజయ్ సేతుపతి కథల సెలక్షన్ మీద వాళ్లకి కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి పూరీ జగన్నాథ్ తో బెగ్గర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఒక వెబ్ సీరీస్ కు సైన్ చేసినట్టు తెలుస్తుంది. మహారాజ 2 సినిమా అనౌన్స్ మెంట్ తోనే సినిమాపై సూపర్ బజ్ రాబోతుందని తెలుస్తుంది. మరి ఈసారి విజయ్ సేతుపతి, నిథిలన్ స్వామినాథన్ ఏం చేస్తారో అని ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఉన్నారు.