Begin typing your search above and press return to search.

మహానటి మళ్లీ వెనకపడిందే.. కారణాలు ఏంటి..?

మహానటి కీర్తి సురేష్ తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించినా సరే ఇక్కడ వరుస అవకాశాలను తెచ్చుకోవడంలో మాత్రం విఫలమవుతుంది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 5:30 AM GMT
మహానటి మళ్లీ వెనకపడిందే.. కారణాలు ఏంటి..?
X

మహానటి కీర్తి సురేష్ తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించినా సరే ఇక్కడ వరుస అవకాశాలను తెచ్చుకోవడంలో మాత్రం విఫలమవుతుంది. టాలీవుడ్ సినిమాలతోనే కెరీర్ గ్రాఫ్ పీక్స్ కు చేరేలా చేసుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇక్కడ చేసిన మహానటితోనే నేషనల్ అవార్డుని సైతం దక్కించుకుంది. తనకు అవకాశాలు రాకపోవడానికి తన లుక్స్ కారణమనుకున్న అమ్మడు స్లిమ్ లుక్స్ తో సర్ ప్రైజ్ చేసింది. ఇక మారిన కొత్త లుక్ తో పాటుగా గ్లామర్ విషయంలో కూడా కాస్త లిమిట్స్ తీసేసిన కీర్తి సురేష్ తెలుగు తమిళంలో సత్తా చాటాలని అనుకుంది.

తెలుగులో మహేష్ తో సర్కారు వారి పాట చేసిన కీర్తి సురేష్ ఆ సినిమాతో హిట్ అందుకున్నా ఆ నెక్స్ట్ నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన చిరంజీవి బోళా శంకర్ తో షాక్ తిన్నది. ఆ సినిమాలో చిరంజీవికి సిస్టర్ పాత్ర చేసిన కీర్తి సురేష్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో డీలా పడింది. ఆ తర్వాత తెలుగులో అమ్మడికి ఒక్కటంటే ఒక్క ఆఫర్ రావట్లేదు. హీరోయిన్ గా ఎలాంటి పాత్ర ఇచ్చినా చేసే ప్రతిభ తన సొంతమైనా సరే కీర్తి సురేష్ కి తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.

అయితే తెలుగులో రాకపోయినా సరే తమిళ్ లో మాత్రం కీర్తి ఫాం కొనసాగిస్తుంది. 2024 లో ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ లో అలా బిజీగా ఉన్నా కీర్తి సురేష్ టాలీవుడ్ నుంచి మాత్రం ఒక్క సినిమా ఆఫర్ అందుకోలేదు. మరి మనోళ్లకు కీర్తి సురేష్ అప్పుడే బోర్ కొట్టేసిందా లేక ఆమె చేసే పాత్రలు రాయట్లేదా అన్నది తెలియాల్సి ఉంది.

తెలుగులో హీరోయిన్స్ కొరత ఉందని అంటారు. ఇక్కడ సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్న హీరోయిన్స్ ని మాత్రం పట్టించుకోరు. మహానటి తెలుగులో వరుస సినిమాలు చేస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నా ఆమెకు అవకాశాలు ఇవ్వడంలో దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అయితే కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రం కీర్తి సురేష్ మంచి ఆప్షన్ అవుతుంది. అందుకే కొత్త దర్శకులు హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉందని అనుకుంటే కీర్తి సురేష్ పేరునే ముందు ప్రిఫర్ చేస్తున్నారు. దసరా లోని వెన్నెల లాంటి పాత్రలు వస్తే నటిగా తన సత్తా చాటుతూ తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది కీర్తి సురేష్.