Begin typing your search above and press return to search.

3 భాగాలుగా `మ‌హాభార‌తం`.. షాక్ ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి!

అలాగే టాలీవుడ్ నుంచి రాజ‌మౌళి కూడా తెరకెక్కించాల‌ని చూస్తున్నారు. ఇలా ఎలా చూసినా మ‌హాభా రతం దర్శ‌కుల జాబితా పెద్ద‌దే ఉంది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 9:19 AM GMT
3 భాగాలుగా `మ‌హాభార‌తం`.. షాక్ ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి!
X

మ‌హాభార‌తం తెర‌కెక్కించాల‌ని బాలీవుడ్ లో చాలా మంద ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే టాలీవుడ్ నుంచి రాజ‌మౌళి కూడా తెరకెక్కించాల‌ని చూస్తున్నారు. ఇలా ఎలా చూసినా మ‌హాభా రతం దర్శ‌కుల జాబితా పెద్ద‌దే ఉంది. ఏ ఒక్క‌రికో పేటెంట్ రైట్స్ లేవు కాబ‌ట్టి ఎంత మందైనా.. ఎలాగైనా తీయోచ్చు. తాజాగా బాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వివేక్ అగ్నిహోత్రి కూడా ఈ జాబితాలో చేరిపో యారు.

మ‌హాభార‌తం ఆధారంగా త‌న త‌దుప‌రి సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన వివ‌రాల్ని ఎక్స్ లో తెలిపారు. క‌న్న‌డ ర‌చ‌యిత ఎన్. ఎల్ బైర‌ప్ప మ‌హాభార‌తం ఆధారంగా 'ప‌ర్వ' అనే పుస్త‌కాన్ని వివేక్ అగ్ని హోత్రి సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే ఈ పుస్త‌కాన్ని ప‌లు భాష‌ల్లోనూ అనువ‌దించారు. ఇదే విష‌యాన్ని వివేక్ తెలిపారు. త‌న సినిమాకి `ప‌ర్వ` అనే టైటిల్ ని ఖారారు చేసారు.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని లాంచ్ చేసారు. పోస్ట‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. పోస్ట‌ర్ తోనే ప‌ర్వ పై పాజిటివ్ ఇంప్రెస్ ప‌డింది. ధ‌ర్మానికి సంబంధించిన ఓ పురుణాక‌థ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రానున్న‌ట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే ఇస్తామ‌ని తెలిపారు. ఇక వివేక్ సంచ‌ల‌న చిత్రాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

'ది కశ్మీర్ ఫైల్స్' తో దేశంలోనే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా పేరుగాంచారు. వివాదాలు..విమ‌ర్శ‌ల చుట్టూ తిరిగిన ఆ సినిమా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకొచ్చింది. అటు పై ఇటీవ‌లే 'వ్యాక్సిన్ వార్' అంటూ మ‌రో చిత్రాన్ని రిలీజ్ చేసారు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డం లో విఫ‌ల‌మైంది. ఈ గ్యాప్ లోనే మ‌హాభారతం ప్ర‌క‌టించి వార్త‌ల్లొ నిలిచారు. ఇంత‌వ‌ర‌కూ 'మ‌హా భార‌తం' తీస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లొచ్చాయిగానీ ఏ ఒక్క‌రూ ముందుకెళ్లలేదు. వివేక్ మాత్రం ఫ‌స్ట్ లుక్ తోనే స‌ర్ ప్రైజ్ ఇచ్చారు.