అమీర్ ఖాన్, రాజమౌళి పక్కనే కన్నప్ప డైరెక్టర్!
మహాభారతం అన్నది ఇప్పటివరకూ ఇద్దరి టార్గెట్ మాత్రమే. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్...టాలీవుడ్ నుంచి రాజమౌళి పేర్లు మాత్రమే అధికారికంగా బయటకు వచ్చాయి.
By: Tupaki Desk | 25 Jun 2025 6:44 AMమహాభారతం అన్నది ఇప్పటివరకూ ఇద్దరి టార్గెట్ మాత్రమే. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్...టాలీవుడ్ నుంచి రాజమౌళి పేర్లు మాత్రమే అధికారికంగా బయటకు వచ్చాయి. మహాభారంత రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. దీన్ని ఆయన ఓ యజ్ఞంలా భావిస్తున్నారు. దర్శకుడిగా అపార అనుభవం సంపాదించిన తర్వాత తీయాలనుకుటున్నాడు. అందుకు ఇంకాస్త సమయం పడుతుంది. అమీర్ ఖాన్ అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టారు.
తన రైటింగ్ తో అసోసియేట్ అయిన ఆయన పనిచేస్తున్నారు. స్క్రిప్ట్ సిద్దమవ్వడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఇదే ప్రాజెక్ట్ ను రాజమౌళి డైరెక్ట్ చేస్తే బాగుటుంది కదా? అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ రాజమౌళి అందుకు సిద్దంగా లేకపోవడంతో సాధ్యపడలేదు. పైగా ఆయన విజన్ లో శ్రీకృష్ణుడు పాత్ర కోసం తెలుగు హీరో మాత్రమే పనిచేయాలి అనే కండీషన్ కూడా ఉంది.
ఇలా మహా భారతం పై ఇద్దరు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే తాజాగా వాళ్ల సరసన 'కన్నప్ప' డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కూడా చేరాడు. అవును ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. మహా భారతం, రామాయణం అందరికీ అందుబాటులో ఉన్న కథలు. వాటిని ఎవరైనా తీయోచ్చు. మహా భారతాన్ని సినిమా గా తీయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టా.
కన్నప్ప విడుదల తర్వాత ఆ వివరాలు వెల్లడిస్తాను. ఇలాంటి సినిమాలకు విజువల్ ఎఫెక్స్ట్ ఖచ్చితంగా అవసరమే. అలాగని వాటిపైనే ఆధార పడకూడదు. ఏ హంగులైనా చెబుతున్న కథలో ఇమిడిపోవాలి అన్నారు. దీంతో అమీర్ ఖాన్, రాజమౌళికి పోటీగా ముకేష్ కుమార్ సింగ్ కూడా బరిలో ఉన్నట్లు కన్పమ్ అయింది. ముకేష్ మాటల్ని బట్టి ముందుగా అతడి భారతమే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.