Begin typing your search above and press return to search.

చియాన్ 'మహాన్ 2' అంటూ అగ్గి రాజేసాడు

కొంత ఏజ్ ని బ‌హిర్గ‌త ప‌రిచే తన ఫోటోలను షేర్ చేసి దానికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ఇచ్చాడు. "మహాన్ 2!!?" అని కొత్త లీక్ ఇచ్చాడు. దీంతో సినీ ఔత్సాహికుల్లో ఈ సీక్వెల్‌పై ఆసక్తి పెరిగింది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:06 AM GMT
చియాన్ మహాన్ 2 అంటూ అగ్గి రాజేసాడు
X

చియాన్ విక్రమ్ ప్ర‌ధానపాత్ర‌లో పా రంజిత్ దర్శకత్వం వహించిన 'తంగలన్' విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ స‌హా టీజ‌ర్ ఆస‌క్తిని పెంచాయి. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌తి అప్ డేట్ ఉత్కంఠ‌ను పెంచుతున్నాయి. ఇటీవ‌లే 'ధృవ నచ్చతిరం: చాప్ట‌ర్ 1 యుద్ధ కాండమ్' ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

నేటితో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రం మహాన్ రెండ‌వ వార్షికోత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విక్రమ్ సోషల్ మీడియాలో త‌న ఆనందం వ్య‌క్తం చేసారు. కొంత ఏజ్ ని బ‌హిర్గ‌త ప‌రిచే తన ఫోటోలను షేర్ చేసి దానికి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ఇచ్చాడు. "మహాన్ 2!!?" అని కొత్త లీక్ ఇచ్చాడు. దీంతో సినీ ఔత్సాహికుల్లో ఈ సీక్వెల్‌పై ఆసక్తి పెరిగింది.

'మహాన్ 2' కార్యరూపం దాల్చుతుందా లేదా అనేది ఇప్ప‌టికి స‌స్పెన్స్. కార్తీక్ సుబ్బ‌రాజు, చియాన్ విక్రమ్‌లకు మాత్రమే త‌దుప‌రి ఏం జ‌రుగుతుందో తెలుసు. అభిమానులు కార్తీక్ సుబ్బరాజ్‌ని స్క్రిప్టు రెడీ చేసి సెట్స్ కెళ్లాల్సిందిగా కోరుతున్నారు. మ‌హాన్ త‌ర‌హా మ్యాజిక్ ని మ‌రోసారి చియాన్ నుంచి కోరుకుంటున్నామ‌ని చెబుతున్నారు. మ‌రి మునుముందు దీనిపై అప్ డేట్ చెబుతారేమో చూడాలి.

మహాన్ - 2022లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. కార్తీక్ సుబ్బరాజ్ రచన -దర్శకత్వంలో రూపొందింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై S. S. లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో విక్రమ్, సిమ్రాన్, ధృవ్ విక్రమ్, బాబీ సింహా, సనంత్, వెట్టై ముత్తుకుమార్, దీపక్ పరమేష్, ఆడుకలం నరేన్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.

గాంధీ మహాన్ అనే ఉపాధ్యాయుడు... కుటుంబానికి దూర‌మ‌య్యాక‌.. మద్యం వ్యాపారిగా మారి తన జీవితాన్ని గడుపుతాడు. కానీ అతడి కుమారుడు దాదాభాయ్ నౌరోయిజీ, ఒక అతివాద గాంధేయవాది.. తన తండ్రిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. గాంధేయ సూత్రాలను ఉల్లంఘించినందున తండ్రికి వ్య‌తిరేకిగా మార‌తాడు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో సినిమా ఇది.