Begin typing your search above and press return to search.

అందుకే 'మేజిక్' జ‌ర‌గ‌డం లేదా?

ఫ‌స్ట్ సింగిల్ అయితే వ‌చ్చింది కానీ దానికి అనుకున్న స్థాయి రెస్పాన్స్ మాత్రం రాలేదు. ఇంకా చెప్పాలంటే అనిరుధ్ నుంచి వ‌చ్చిన పాట‌లా ఆ సాంగ్ లేదు.

By:  Tupaki Desk   |   22 July 2025 8:00 PM IST
అందుకే మేజిక్ జ‌ర‌గ‌డం లేదా?
X

ఏది ఎప్పుడు జ‌ర‌గాలో అప్పుడే జ‌రుగుతుందంటారు పెద్ద‌లు. అందుకే ఎంత ముందు మొద‌లైనా కొన్ని సినిమాలు రిలీజ్ కావు. వాటి త‌ర్వాత మొద‌లైన సినిమాలు కూడా రిలీజ‌వుతుంటాయి కానీ అవి మాత్రం ఇంకా ప్రొడ‌క్ష‌న్ లోనే ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకొచ్చిందంటే విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో కింగ్‌డ‌మ్ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

వాస్త‌వానికి గౌత‌మ్, కింగ్‌డ‌మ్ కంటే ముందే మేజిక్ అనే సినిమాను చేశారు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయిందన్నారు కానీ ఇప్ప‌టివ‌ర‌కు సినిమా రిలీజైంది లేదు. ఈ సినిమా కూడా సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లోనే తెర‌కెక్కింది. కొత్త‌వాళ్ల‌తో గౌత‌మ్ తీసిన ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా ఇప్ప‌టికే మేజిక్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ కూడా రిలీజైంది.

ఫ‌స్ట్ సింగిల్ అయితే వ‌చ్చింది కానీ దానికి అనుకున్న స్థాయి రెస్పాన్స్ మాత్రం రాలేదు. ఇంకా చెప్పాలంటే అనిరుధ్ నుంచి వ‌చ్చిన పాట‌లా ఆ సాంగ్ లేదు. అయితే అస‌లు మేజిక్ సినిమా ఇంకా రిలీజ్ కాకపోవ‌డానికి కార‌ణ‌మేంటా అని ఆలోచిస్తే దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా పెండింగ్ లోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

దాంతో పాటూ స్క్రిప్ట్ లో కొన్ని కరెక్ష‌న్లు రావ‌డంతో మ‌ళ్లీ రీషూట్ కు వెళ్లాల‌ని మేక‌ర్స్ డిసైడ‌య్యార‌ట‌. కానీ గౌత‌మ్ కింగ్‌డ‌మ్ తో బిజీ అవ‌డం వ‌ల్ల మేజిక్ ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింది. కింగ్‌డ‌మ్ రిలీజ‌య్యాక గౌత‌మ్ ఎలాగూ ఫ్రీ అవుతారు కాబ‌ట్టి అప్ప‌ట్నుంచి మ‌ళ్లీ మేజిక్ సినిమాను రిలీజ్ కు రెడీ చేసే ప‌నిలో ప‌డ‌తారు. అయితే మేజిక్ మూవీ ఇప్పటిక‌ప్పుడు రిలీజ్ కు రెడీ అయినా దానికి మంచి డేట్ కావాలి. కానీ డిసెంబ‌ర్ వ‌ర‌కు సోలో రిలీజ్ డేట్ దొరికే ఛాన్స్ లేదు. మేజిక్ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అవాలంటే సోలోగానే రిలీజ‌వాలి. కింగ్‌డ‌మ్ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే మేజిక్ కు అది ప్ల‌స్స‌య్యే ఛాన్సుంది. అనిరుధ్ ఉన్నారు కాబ‌ట్టి త‌మిళంలో కూడా మంచి క్రేజ్ ఏర్ప‌డుతుంది. మ‌రి మేజిక్ విష‌యంలో మేక‌ర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో వారికే తెలియాలి. ప్ర‌స్తుతానికైతే అంద‌రి ఫోక‌స్ కింగ్‌డ‌మ్ పైనే ఉంది.