Begin typing your search above and press return to search.

MAD ట్రైలర్: కాలేజి అల్లరి ఎలా ఉందంటే..

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలలో కొత్త తారాగణంతో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం "MAD" అక్టోబర్ 6న రాబోతోంది.

By:  Tupaki Desk   |   3 Oct 2023 6:00 AM GMT
MAD ట్రైలర్: కాలేజి అల్లరి ఎలా ఉందంటే..
X

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలలో కొత్త తారాగణంతో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం "MAD" అక్టోబర్ 6న రాబోతోంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక ​​సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్‌లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక నార్నే నితిన్ ఎన్టీఆర్ బావమరిది అని అందరికి తెలిసిన విషయమే.

"MAD" ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ దామోధర్, మనోజ్ అశోక్ అనే ముగ్గురు స్నేహితులుగా కనిపిస్తున్నారు. పూర్తిగా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ లవ్ కామెడీ యాంగిల్స్ ను టచ్ చేస్తూ ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

కామెడీ పంచ్ లు అలాగే కాలేజీలో అల్లరిగా తిరిగే కుర్రాళ్ళు ఏ విధంగా ఉంటారు అనే పాయింట్స్ ను దర్శకుడు మేజర్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్లో అక్కడక్కడ పంచ్ లు బాగానే పేలాయి. సీనియర్ నటుడు రఘుబాబు అలాగే మరి కొంతమంది ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక జాతి రత్నాలు దర్శకుడు అనిరుద్ కూడా ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు హైలెట్ చేశారు. ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు అంటూ వాచ్ మెన్ ఇంట్రడక్షన్ ఇస్తూ నేను కూడా ఈ కాలేజీలోనే చదువుకున్నాను అని చెప్పడం సినిమాలో కామెడీ టచ్ ప్రతీ పాత్రలో ఉండబోతున్నట్లు చెప్పేశారు.

ఈ మధ్యకాలంలో పూర్తిస్థాయిలో కామెడీ సినిమాలు పెద్దగా రాలేదు కాబట్టి మ్యాడ్ సినిమాకు ఇది మంచి అవకాశం. అంతేకాకుండా గత రెండు మూడు వారాలుగా పూర్తిస్థాయిలో ఏ సినిమా మెప్పించలేదు. కాబట్టి ఈ సినిమా వెండితెరపై ఏమాత్రం పాజిటివ్ టాక్ అందుకున్న కూడా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంటుంది. స్టార్ క్యాస్ట్ లేకపోయినప్పటికీ కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ అయితే చేస్తోంది. ఇక ఎన్టీఆర్ బావమరిది నితిన్ ఈ సినిమాతో సక్సెస్ అందుకొని ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.