Begin typing your search above and press return to search.

అల్లు అర‌వింద్ ఫ్రెండు 'పిచ్చెక్కించే' సినిమాలు తీస్తాడట‌

`గ‌జిని` హిందీ వెర్ష‌న్ సహా ప‌లు చిత్రాల‌కు అల్లు అర‌వింద్ తో స‌హ నిర్మాత‌గా కొన‌సాగారు మ‌ధు మంతెన‌.

By:  Tupaki Desk   |   17 Jun 2025 8:00 AM IST
అల్లు అర‌వింద్ ఫ్రెండు పిచ్చెక్కించే సినిమాలు తీస్తాడట‌
X

`గ‌జిని` హిందీ వెర్ష‌న్ సహా ప‌లు చిత్రాల‌కు అల్లు అర‌వింద్ తో స‌హ నిర్మాత‌గా కొన‌సాగారు మ‌ధు మంతెన‌. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సాన్నిహిత్యం, స్నేహానుబంధం ఎలాంటిదో ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌కు తెలుసు. `రామాయ‌ణం` ఫ్రాంఛైజీ సినిమాలను ఆ ఇద్ద‌రూ క‌లిసి నిర్మించాల‌ని క‌ల‌లు క‌న్నారు.. కానీ ఎందుక‌నో అది వాయిదా ప‌డింది.

మ‌ధు మంతెన ఇటీవ‌ల బాలీవుడ్ లో యాక్టివ్ గా కొన్ని సినిమాలు నిర్మించారు. కానీ ఇప్పుడు వాట‌న్నిటికీ భిన్నంగా ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్టు తెలిసింది. మారిన ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు ఆయ‌న ఆలోచ‌న‌లు మారాయ‌ని తెలుస్తోంది. కొత్త క‌ల‌ల్ని కొత్త‌గా నిర్మించేందుకు అత‌డు `మ్యాడ్ మ్యాన్` అనే కొత్త బ్యాన‌ర్ ని ప్రారంభించారు. ఈ బ్యాన‌ర్ ప్రారంభించ‌డం వెన‌క చాలా పెద్ద ఆలోచ‌నే ఉంద‌ని బాలీవుడ్ హంగామా పేర్కొంది.

మధు మంతెన కొత్త‌ బ్యానర్ `మ్యాడ్ మ్యాన్` హై ఆక్టేన్ యాక్షన్ ఫ్రాంచైజీపై పనిచేస్తోందని వెల్ల‌డించింది. నేటి చిత్ర పరిశ్రమలోని అత్యంత తెలివైన యువ దర్శకులతో ఆయన చర్చలు జరుపుతున్నార‌ని కూడా బాలీవుడ్ హంగామా వెల్ల‌డించింది. మ‌ధు మంతెన మాట్లాడుతూ..నేను ప్రస్తుతం పేర్లను వెల్లడించే స్థితిలో లేను. కానీ నా నిర్మాణ సంస్థ మ్యాడ్ మ్యాన్ గొప్ప‌ ప్ర‌ణాళిక‌ల‌తో ఉంది. మేం త్వరలో కొన్నిటిని ప్ర‌క‌టిస్తాము. ఇప్ప‌టికి చెప్పగలిగేది ఏమిటంటే, మా నుండి ఊహించనిది మాత్రమే ఆశించండి. ఇతర నిర్మాణ సంస్థలు ఇప్పటికే చేసినది ఏదీ చేయడానికి మ్యాడ్ మ్యాన్ ఆసక్తి చూపదు``అని మ‌ధు మంతెన అన్నారు.

ఒక పెద్ద సూప‌ర్ స్టార్ తో లేదా యువ నటీనటుడితో కూడిన స్వదేశీ యాక్షన్ ఫ్రాంచైజీని తెర‌కెక్కించాల‌ని మ‌ధు మంతెన ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. ఆస‌క్తిక‌రంగా mad man లో Madhu Mantena లోని కొన్ని అక్ష‌రాలు క‌లిసొచ్చేలా బ్యాన‌ర్ టైటిల్ ని ఫిక్స్ చేసార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. మ్యాడ్ అనే దాంట్లోనే చాలా మీనింగ్ ఉంది. క‌చ్ఛితంగా యూత్ కి పిచ్చెక్కించే సినిమాలే ఈ బ్యాన‌ర్ నుంచి వ‌స్తాయ‌ని అంచ‌నా వేయొచ్చు. ఫ్రెండు పిచ్చెక్కించే సినిమాలు తీస్తే, అల్లు అర‌వింద్ ఊరుకుంటారో లేదో చూడాలి.