Begin typing your search above and press return to search.

మరో బాలీవుడ్‌ హిట్‌ లో సౌత్‌ స్టార్‌ కీలకం..!

సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది జ్యోతిక మరియు మాధవన్ ల నటన అంటూ స్వయంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 March 2024 9:38 AM GMT
మరో బాలీవుడ్‌ హిట్‌ లో సౌత్‌ స్టార్‌ కీలకం..!
X

సౌత్ సినీ ఇండస్ట్రీతో పోల్చితే బాలీవుడ్‌ లో హిట్స్ శాతం ఈ మధ్య కాలంలో చాలా దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు ఈజీగా వందల కోట్ల వసూళ్లు రాబట్టిన హీరోలు కూడా ఇప్పుడు మినిమం వసూళ్లు సాధించేందుకు కష్టపడాల్సిన పరిస్థితి. హిట్ అయిన సినిమాలు భారీగా వసూళ్లు సాధిస్తే కొన్ని మాత్రం బొక్క బోర్లా పడుతున్నాయి.

బాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో హిట్ టాక్‌ దక్కించుకుని, డీసెంట్‌ వసూళ్లు దక్కించుకున్న సినిమాల్లో సౌత్‌ స్టార్స్ ఉన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. సౌత్‌ నటీ నటులు లేదా దర్శకులు వర్క్‌ చేసిన బాలీవుడ్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను దక్కించుకుంటూ ఉన్నాయి.

తాజాగా బాలీవుడ్‌ లో విడుదల అయిన చిత్రం 'సైతాన్‌'. అజయ్ దేవగన్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ జ్యోతిక మరియు తమిళ స్టార్‌ నటుడు మాధవన్‌ లు కీలక పాత్రలో నటించారు. సినిమా లో అత్యంత క్రూరమైన విలన్ పాత్రను మాధవన్‌ పోషించి ఆకట్టుకున్నాడు.

సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది జ్యోతిక మరియు మాధవన్ ల నటన అంటూ స్వయంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రివ్యూలు చెప్పిన సమయంలో వీరిద్దరి పేర్లు ప్రధానంగా చెబుతున్నారు. సో బాలీవుడ్‌ లో మరో విజయం దక్కడానికి కారణం మన వాళ్లే అన్నట్లుగా సౌత్‌ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సైతాన్ సినిమా విషయానికి వస్తే హ్యాపీ ఫ్యామిలీలోకి వశీకరణ తెలిసిన ఒక విలన్ ఎంట్రీ ఇచ్చి ఎలాంటి పరిణామాలు క్రియేట్‌ చేశాడు.. ఆ విలన్ నుంచి తన కూతుర్ని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది కథాంశం. కథ చాలా సింపుల్ గా ఉన్నా కూడా టేకింగ్‌ మరియు స్క్రీన్‌ ప్లే చాలా బాగున్నాయని రివ్యూలు వచ్చాయి.

ఇది గుజరాతీ మూవీ వష్‌ కి రీమేక్‌. సౌత్‌ లో కూడా ఈ సినిమా రీమేక్ కి చర్చలు జరుగుతున్నాయని టాక్‌ వినిపిస్తోంది. అయితే తెలుగు లో ఇప్పటికే ఇలాంటి కాన్సెప్ట్‌ తో సినిమాలు వచ్చాయి. కనుక రీమేక్ కంటే డబ్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.