Begin typing your search above and press return to search.

పూర్తిగా చెడ్డ వాడిగా మారిన స్టార్‌ నటుడు

ఈ మధ్య కాలంలో సీనియర్‌ హీరో మాధవన్ సైతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా వరుస సినిమాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   10 April 2025 2:00 AM IST
Madhavan Villian Roles
X

ప్రతి నటుడు అన్ని రకాల పాత్రలు చేయాలని అనుకుంటాడు. కానీ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసేందుకు ధైర్యం కావాలి. హీరోగా నటించి మెప్పించిన వారు సైతం విలన్‌ పాత్రల్లో తేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. విలన్‌గా మెప్పించాలంటే, విలనిజంతో సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవాలంటే కచ్చితంగా అంతకు మించి అన్నట్లుగా ప్రతిభ ఉండాల్సిందే. అలాంటి ప్రతిభ ఉంటేనే విలన్‌ పాత్రల్లో నటించేందుకు నటీనటులు ఆసక్తి కనబర్చుతూ ఉంటారు. విలన్‌ పాత్రల్లో నటించేందుకు కొందరు ప్రత్యేక ఆసక్తిని కనబర్చుతూ ఉంటే, కొందరు మాత్రం నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర అంటే బాబోయ్ నా వల్ల కాదు అని తప్పుకునే వారు ఉంటారు


హీరోగా సుదీర్ఘ కాలం నటించిన వారు ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కొందరు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కొనసాగుతూనే అప్పుడప్పుడు నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలను చేస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్ వంటి వారు ఒక వైపు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తూ మరో వైపు సందర్భానుసారంగా నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో సీనియర్‌ హీరో మాధవన్ సైతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా వరుస సినిమాలు చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న మాధవన్‌ విలన్‌గానూ మెప్పిస్తూ ఉన్నాడు. మొన్నటి వరకు ఒక మోస్తరు నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ వచ్చిన మాధవన్‌ ఈమధ్య పూర్తిగా మారిపోయాడు.

ఒకప్పుడు లవ్‌ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న మాధవన్ ఇప్పుడు ఇమేజ్‌ పూర్తిగా మారింది. నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలకు, విలన్ పాత్రలకు మాధవన్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన టెస్ట్‌ సినిమా ఓటీటీ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి స్పందన దక్కిన విషయం తెలిసిందే. ఓటీటీ ద్వారా విడుదలైన ఈ సినిమాలో సిద్దార్థ్‌ కీలక పాత్రలో నటించాడు. నయనతార భర్త పాత్రలో మాధవన్ నటించాడు. క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంలో సాగే సినిమా. మంచి వాడిగా కనిపిస్తూనే అవసరం కోసం క్రూరంగా మారే పాత్రలో మాధవన్ టెస్ట్‌ సినిమాలో కనిపించి మెప్పించాడు.

మాధవన్ అనగానే ఆయన అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆయన నటించిన ప్రేమ కథ సినిమాలు గుర్తుకు వస్తాయి. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన మాధవన్ లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన నుంచి ఇంకా హీరోయిజంతో కూడిన సినిమాలను ప్రేక్షకులు ఆశించడం లేదని గుర్తించాడు. అందుకే మెల్ల మెల్లగా విలన్ గా మారుతూ వచ్చాడు. ఇటీవల కాలంలో షైతాన్‌, టెస్ట్‌ మరి కొన్ని సినిమాలతో పూర్తిగా చెడ్డ వాడి పాత్రలను చేయడం ద్వారా విలన్‌గా టర్న్‌ అయ్యాడు. ముందు ముందు సౌత్‌లోనూ వరుసగా విలన్ పాత్రలు పోషించే అవకాశాలు ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్‌ల కొరత ఉంది. అందుకే మాధవన్‌ ను కచ్చితంగా టాలీవుడ్‌లో విలన్‌గా నటింపజేసే అవకాశాలు ఉన్నాయి.