Begin typing your search above and press return to search.

ట్రోల్స్ ఎఫెక్ట్‌... రొమాంటిక్ సినిమాలకు గుడ్‌ బై

మూడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మాధవన్ ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించాడు. ఈయన కెరీర్‌ ఆరంభంలో ఎక్కువ శాతం లవ్‌ కమ్‌ రొమాంటిక్ సినిమాల్లో నటించాడు.

By:  Tupaki Desk   |   13 July 2025 3:27 PM IST
ట్రోల్స్ ఎఫెక్ట్‌... రొమాంటిక్ సినిమాలకు గుడ్‌ బై
X

మూడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో మాధవన్ ఎన్నో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించాడు. ఈయన కెరీర్‌ ఆరంభంలో ఎక్కువ శాతం లవ్‌ కమ్‌ రొమాంటిక్ సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలో మాధవన్‌కి గుర్తింపు తెచ్చి పెట్టాయి. లవ్‌ స్టోరీస్‌కి ప్రాణం పోసినట్లుగా నటించి మెప్పించగల సత్తా ఉన్న నటుడు అంటూ అన్ని భాషల్లోనూ మాధవన్‌కి అభిమానులు ఏర్పడ్డారు. తమిళ్‌, హిందీ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేస్తూ వచ్చిన మాధవన్ ఇతర భాషల్లోనూ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. హీరోగా ఉన్న సమయంలో ఇతర భాషల్లో సినిమాలు చేయని మాధవన్ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మాత్రం అన్ని భాషల్లోనూ సినిమాల్లో నటిస్తూ వచ్చాడు.

గత కొన్నాళ్లుగా మాధవన్‌ రొమాంటిక్ పాత్రలకు, లవ్‌ స్టోరీస్‌కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఎక్కువ శాతం విలన్‌ పాత్రలకు ఓకే చెబుతూ, తన వయసుకు తగ్గట్టుగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఇటీవల ఈయన చేసిన 'ఆప్‌ జైసా కోయి' సినిమాను చేశాడు. ఈ సినిమా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సాగింది. అయిదు పదుల వయసు ఉండే మాధవన్ తన వయసులో దాదాపు సగం వయసు మాత్రమే ఉండే ఫాతిమా సనా షేక్‌తో కలిసి ఆ సినిమాలో నటించాడు. దాంతో ట్రోల్స్‌ వచ్చాయి. మాధవన్‌ ఈ వయసులో అంత చిన్న వయసు అమ్మాయితో రొమాన్స్ చేయడం అవసరమా అంటూ తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో మాధవన్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

సినిమా ప్రమోషన్ సమయంలోనే ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. మాధవన్ వంటి సీనియర్ హీరో కుర్ర హీరోయిన్స్‌తో రొమాంటిక్ లవ్‌ స్టోరీలు చేయడం ఏంటంటూ విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో మాధవన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆ విమర్శలు మరింత ఎక్కువ కావడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విషయమై స్పందించాడు. తాను ఆ సినిమాలో నటించాలని తీసుకున్న నిర్ణయం కరెక్ట్‌ కాదు అన్నట్లుగా ఒప్పుకోకుండానే ఒప్పుకున్నాడు. తన వయసుకు తగ్గ పాత్రలను చేయాల్సిందని, తాను అలాంటి పాత్రలు చేయకుండా రొమాంటిక్ సినిమాలు చేయాలి అనుకోవడం సరికాదని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

ఆప్‌ జైసా కోయి సినిమాకు రివ్యూవర్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రేక్షకులు సైతం కొందరు పర్వాలేదు అంటే కొందరు మాత్రం పెదవి విరిచారు. మాధవన్ ను అభిమానించే వారు స్వయంగా కొందరు ఫాతిమా సనా షేక్‌తో ఈయన రొమాంటిక్ లవ్‌ సీన్స్‌ ఆకట్టుకోలేదు అంటున్నారు. అందుకే తన పాత్ర గురించి వచ్చిన నెగటివ్‌ కామెంట్స్ నేపథ్యంలో ఇకపై అలాంటి సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. రొమాంటిక్‌ సినిమాల్లో నటించాలని చాలా మంది అడుగుతూనే ఉంటారని, వాటిని నేను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వచ్చాయి. కానీ ఈ సినిమా కథ నచ్చడం వల్ల కమిట్‌ అయ్యాను అని, కానీ ఇక ముందు తన వయసుకు తగ్గ పాత్రలను ఖచ్చితంగా చేయాలని భావిస్తున్నట్లు మాధవన్‌ చెప్పుకొచ్చాడు.