Begin typing your search above and press return to search.

మ్యాడ్ బాక్సాఫీస్.. లెక్క ఎలా ఉందంటే..

సినిమాలు ఏవీ లేకపోవడంతో పాటు థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించడంతో లాంగ్ రన్ కొనసాగి 70 కోట్ల వరకు ఈ చిత్రం కలెక్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 5:00 AM GMT
మ్యాడ్ బాక్సాఫీస్.. లెక్క ఎలా ఉందంటే..
X

గత వారం థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలలో అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న మూవీ ఏదైనా ఉందంటే మ్యాడ్ మాత్రమే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ అయిపొయింది. రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. అయితే వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్స్ మరింత పుంజుకుంటాయని అందరూ భావించారు.

కానీ ఊహించని విధంగా పెద్ద ప్రభావం చూపించలేదు. ఉన్నవాటిలో బెస్ట్ మూవీ కావడంతో యూత్ ఆడియన్స్ మ్యాడ్ మూవీ చూడటానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. అయితే మరీ భారీ కలెక్షన్స్ అయితే రావడం లేదు. అనంతలో పర్వాలేదనే విధంగా ఉన్నాయి. ఎన్ఠీఆర్ బావమరిది నార్నె నితిన్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ వన్ మెన్ షోతో మూవీని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్ళాడు.

ఇంజనీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ కావడంతో యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అయితే ప్రెజెంట్ ట్రెండ్ లో స్టోరీ లేదనే టాక్ ఉంది. కానీ మూవీలో కామెడీని ఫుల్ గా ఆశ్వాదిస్తున్నారు. ఈ మూవీ దర్శకుడు కళ్యాణ్ శంకర్ అనుదీప్ కేవీ దగ్గర జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాలకి వర్క్ చేశాడు. ఈ నేపథ్యంలో మ్యాడ్ చిత్రాన్ని జాతిరత్నాలు మూవీతో పోల్చి చూసారు.

కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే జాతిరత్నాలు సమీపంలోకి కూడా చేరేలా కనిపించడం లేదు. కరోనా సమయంలో కూడా జాతిరత్నాలు మూవీ భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. సినిమాలు ఏవీ లేకపోవడంతో పాటు థియేటర్స్ కి వెళ్లిన ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించడంతో లాంగ్ రన్ కొనసాగి 70 కోట్ల వరకు ఈ చిత్రం కలెక్ట్ చేసింది.

అయితే మ్యాడ్ మూవీ ఇప్పటి వరకు 8 కోట్ల షేర్ మాత్రమే అందుకుంది. లాంగ్ రన్ లో మరో రెండు కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే మ్యాడ్ మూవీ బిజినెస్ పరంగా చూసుకుంటే బ్లాక్ బస్టర్ హిట్ అయిన జాతిరత్నాలుతో పోల్చి చూస్తే సమీపంలోకి కూడా రాలేదని చెప్పొచ్చు.