బావమరిది కోసం వస్తున్న బావ
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధానపాత్రల్లో వచ్చిన తాజా సినిమా మ్యాడ్ స్వ్కేర్.
By: Tupaki Desk | 3 April 2025 11:11 AM ISTనార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధానపాత్రల్లో వచ్చిన తాజా సినిమా మ్యాడ్ స్వ్కేర్. బ్లాక్ బస్టర్ మూవీ మ్యాడ్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ సమర్పించగా, సాయి సౌజన్య, సూర్యదేవర హారిక మ్యాడ్ స్వ్కేర్ ను నిర్మించారు.
మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే మ్యాడ్ స్వ్కేర్ బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల దారిలో నడుస్తోంది. తమ సినిమా ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించి తమ ఆనందాన్ని తెలియచేయాలని ప్లాన్ చేస్తోంది.
ఈ సక్సెస్ మీట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్టుగా తీసుకురావాలని మేకర్స్ ట్రై చేస్తున్నారట. ఏప్రిల్ 4వ తేదీన శిల్ప కళా వేదికలో మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు ఆయన సన్నిహితులు. దానికి కారణం ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ఒక హీరో నార్నే నితిన్, ఎన్టీఆర్ కు స్వయానా బావమరిది అవడం.
దాంతో పాటూ నిర్మాత నాగవంశీతో కూడా ఎన్టీఆర్ కు మంచి అనుబంధముంది. నార్నే నితిన్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర్నుంచి ఎన్టీఆర్ అతనికి డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది లేదు. గతంలో మ్యాడ్ ట్రైలర్ ను రిలీజ్ చేసి టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు తప్పించి ఇలా ఒక ఈవెంట్ కు వచ్చి నితిన్ ను, అతని సినిమాను సపోర్ట్ చేయలేదు. అందుకే మ్యాడ్ స్వ్కేర్ సక్సెస్‌మీట్ కు ఎన్టీఆర్ వస్తున్నాడని అందరూ భావిస్తున్నారు.
చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుండే ఎన్టీఆర్ తనతో క్లోజ్ గా ఉండే హీరోలు, నిర్మాతలు అడిగితే వారి ఫంక్షన్స్ కు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటాడనే విషయం తెలిసిందే. అందులో భాగంగానే గతంలో పలు చిన్న సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గెస్టుగా వెళ్లి ఆ సినిమాలకు తనదైన మద్దతు తెలిపాడు. ఇక మ్యాడ్ స్వ్కేర్ విషయానికొస్తే 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.74 కోట్లు కలెక్ట్ చేసిన త్వరలోనే రూ.100 కోట్ల మార్క్ అందుకునే వీలుంది.