నెట్‌ఫ్లిక్స్ చేతికి మరో క్రేజీ మూవీ
మామన్నన్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మారీసన్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి.
By: Tupaki Desk | 2 April 2025 2:00 PM ISTమలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మలయాళ ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో అందరికీ తెలుసు. మలయాళ నటుడైనప్పటికీ ఫాఫాకు మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆయన హీరోగా మారీసన్ అనే సినిమా చేస్తున్నాడు. సుధీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఫాహద్ ఫాజిల్ తో పాటూ వడివేలు కూడా హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
మామన్నన్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మారీసన్ పై అందరికీ మంచి అంచనాలున్నాయి. మారీసన్ జులై లో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఆ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత మారీసన్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్ కు ఇది నిజంగా చాలా మంచి ఛాన్స్. నెట్‌ఫ్లిక్స్ మారీసన్ రైట్స్ సొంతం చేసుకోవడంతో దాని సబ్‌స్క్రైబర్లు ఎంతో సంతోషంగా ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్లాట్‌ఫామ్ వల్ల మారీసన్ ఎక్కువ మంది ఆడియన్స్ కు రీచ్ అయ్యే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఫాహద్ కు మనదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవల్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మారీసన్ ఆయన ఫ్యాన్స్ కు కూడా రీచ్ అవడానికి నెట్‌ఫ్లిక్స్ కంటే గొప్ప ప్లాట్‌ఫామ్ మరొకటి ఉండదు.
ఏ సినిమాలైనా సబ్‌స్క్రైబర్లు ఎక్కువ ఉన్న ప్లాట్‌ఫామ్స్ లో వస్తే వాటికి ఆదరణ ఎక్కువ లభిస్తుంది. ఆ కారణంగానే మార్కో సోనీలైవ్ లో వచ్చినప్పుడు దానికి పెద్ద ఆదరణ దక్కలేదు. ఇప్పుడు మారీసన్ సినిమా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం వల్ల ఈ సినిమాకు ఓటీటీలో కూడా మంచి ఆదరణ దక్కే అవకాశముంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ కు మంచి అంచనాలున్నాయి.
