Begin typing your search above and press return to search.

వరల్డ్ కప్ టైం లో బంపర్ హిట్.. ఫలితం డిసైడ్ చేసేది వాళ్లే..!

సత్యం రాజేష్ కామాక్షి భాస్కర లీడ్ రోల్ లో అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమా పొలిమేర 2

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:35 PM GMT
వరల్డ్ కప్ టైం లో బంపర్ హిట్.. ఫలితం డిసైడ్ చేసేది వాళ్లే..!
X

సత్యం రాజేష్ కామాక్షి భాస్కర లీడ్ రోల్ లో అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమా పొలిమేర 2. లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. సినిమా ఇప్పటికే లాభాల బాట పట్టగా ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ మీట్ ను ఏర్పాటు చేశారు. సినిమా కాస్ట్ అండ్ క్రూతో పాటుగా డైరెక్టర్ సాయి రాజేష్, హీరో శ్రీ విష్ణు ఈ వేడుకకు అతిథులుగా వచ్చారు.

సక్సెస్ మీట్ లో భాగంగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. హారర్, థ్రిల్లర్, క్రైమ్ జానర్ లు అంటే వసూళ్ల పరిధి తక్కువగా ఉంటుందని అనుకునే వాడిని. వంశీ నందిపాటి ఈ సినిమా రైట్స్ తీసుకుంటే ఎందుకు తీసుకున్నావ్ నీకు పిచ్చి పట్టిందా అని అన్నాను కానీ వంశీ మాత్రం కాన్ఫిడెంట్ గా సినిమా రిలీజ్ చేశాడు. ఇక సినిమా ఫలితం చూశాక నా అంచనాలు తప్పని తెలుసుకున్నానని అన్నారు. నా జడ్జిమెంట్ విషయంలో కనువిప్పు కలిగిందని అన్నారు సాయి రాజేష్. ఈ సినిమాకు కథే కింగ్.. సినిమా విజయం చాలా హ్యాపీగా ఉంది. రాబోయే పొలిమేర 3 కూడా బ్లాక్ బస్టర్ కొడుతుందని అన్నారు సాయి రాజేష్.

పొలిమేర 2 సక్సెస్ మీట్ కి వచ్చిన హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వారంతా కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసని.. సత్యం రాజేష్ నేను హీరో అవుతానని నమ్మిన వ్యక్తి అని అన్నారు. నాకు తెలిసిన ఇంతమంది మిత్రులకు హిట్ ఇచ్చిన దర్శకుడికి థాంక్స్ అన్నారు. సినిమాల్లో చిన్నది పెద్దది అనే తేడా ఉండదు సినిమా రిలీజ్ తర్వాత అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ఆడియన్స్ డిసైడ్ చేసారని అన్నారు. పొలిమేర 2 చాలా పెద్ద సినిమా. కొన్ని సినిమాలు బాగున్నా థియేటర్స్ లో సరిగా ఆడవు. కానీ ఈ సినిమ వరల్డ్ కప్ జరుగుతున్న టైం లో ఇంత మంచి వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమని అన్నారు.

నిర్మాత గౌరి కృష్ణ మాట్లాడుతూ.. సినిమా విజయానికి కారణం దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ప్రతిభ. కొన్నాళ్లుగా నాకు సరైన సక్సెస్ రాలేదు పొలిమేర 1 చూసి దర్శకుడు అనిల్ ను కలిసి ఈ సినిమా చేశాను. సరైన టైం లో మంచి విజయం అందించారు. ఈ సినిమా సక్సెస్ లో వంశీ నందిపాటి ఒకరు. ఆయన గ్రాండ్ గా సినిమా రిలీజ్ చేశారు. సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా కష్టపడ్డారు. ఇలాంటి విజయాలు సినిమాకు పనిచేసిన అందరికి మరెన్నో రావాలని అన్నారు.

ఈ సినిమా జర్నీలో అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ నాకు నేనే ధైర్యం తెచ్చుకుని జర్నీ కొనసాగించా. సినిమా సక్సెస్ తర్వాత నా లైఫ్ ఇక నుంచి వేరేలా ఉంటుందని అన్నారు. ఈ సినిమా సక్సెస్ సమిష్టి కృషి అని అన్నారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్.

సినిమా రిలీజ్ చేసిన వంశీ నందిపాటి మాట్లాడుతూ మనం నమ్మింది నిజం అయితే ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది. సక్సెస్ అంటే సెల్ఫ్ శాటిస్ఫాక్షన్. ఈ సినిమా విషయంలో అదే జరిగిందని అన్నారు. మా టీం ఎంతో కష్టపడి ఈ విజయం సాధించారని పొలిమేర ప్రాంచైజీ కంటిన్యూ అవుతుందని అన్నారు. సినిమా లీడ్ రోల్ లో నటించిన సత్యం రాజేష్ మాట్లాడుతూ నా నిర్మాత గౌరీ కృష్ణని నిలబెట్టడమే నా లక్ష్యం. నిర్మాత ఎంతో కష్టపడి సినిమా చేశారు. వంశీ నందిపాటి ఎంట్రీతో ఈ సినిమా పెద్దది అయ్యింది. వీరిద్దరు ఈ సినిమాకు రెండు కళ్లు లాంటి వారు. దర్శకుడు అనిల్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. సినిమా విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు సత్యం రాజేష్.