MIBతో సామ్ నయా హిస్టరీ.. మరి సీక్వెల్ తో?
పార్ట్-2 కోసం ఇప్పటికే ఒక స్ట్రాంగ్ స్టోరీ లైన్ సిద్ధంగా ఉందని రాజ్ నిడిమోరు వెల్లడించారు. మరో రెండేళ్లలో సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో ఉన్నట్లు తెలిపారు.
By: M Prashanth | 12 July 2026 2:30 PM ISTఒక హీరోయిన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తే అది మామూలు విషయం కాదు. అదే సినిమా కొత్త రికార్డులు సృష్టించి, వెంటనే సీక్వెల్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇప్పుడు సమంత నటించిన మా ఇంటి బంగారం (MIB) విషయంలో అదే చర్చ జరుగుతోంది. తొలి పార్టుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ చిత్రం.. ఇప్పుడు రెండో భాగంతో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందన్నది హాట్ టాపిక్ గా మారింది.
మా ఇంటి బంగారం విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. స్టోరీ, సామ్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది! అయితే ఒక హీరోయిన్ లీడ్ రోల్ లో వచ్చిన తెలుగు సినిమా ఆ రేంజ్ లో వసూళ్లు నమోదు చేయడం విశేషం.
దీంతో సమంత లేడీ ఓరియెంటెడ్ మూవీతో రూ.100 కోట్ల ఫీట్ అందుకున్న ఫస్ట్ హీరోయిన్ గా హిస్టరీ క్రియేట్ చేశారు. అయితే మూవీ సక్సెస్ మీట్ లో మరో ప్రకటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. రైటర్ రాజ్ నిడిమోరు.. మా ఇంటి బంగారం పార్ట్-2 వస్తే చూస్తారా?' అని అడగగా భారీ రెస్పాన్స్ కనిపించింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆ ఉత్సాహాన్ని చూసిన ఆయన.. సీక్వెల్ ను అధికారికంగా ప్రకటించారు.
పార్ట్-2 కోసం ఇప్పటికే ఒక స్ట్రాంగ్ స్టోరీ లైన్ సిద్ధంగా ఉందని రాజ్ నిడిమోరు వెల్లడించారు. మరో రెండేళ్లలో సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో ఉన్నట్లు తెలిపారు. సాధారణంగా ఒక సినిమా పూర్తయిన తర్వాత దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన తనకు రాదని, కానీ మా ఇంటి బంగారం విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా అనిపించిందని చెప్పారు.
మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగాన్ని మరింత పెద్ద స్థాయిలో రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్లు ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. కొత్త రోల్స్, కొత్త ట్విస్టులు, మరింత ఎంటర్టైన్మెంట్ తో కథను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో తొలి భాగాన్ని ఆస్వాదించిన ప్రేక్షకుల్లో ఇప్పుడు సీక్వెల్ పై ఆసక్తి మరింత పెరిగింది. సమంత, దర్శకురాలు నందిని రెడ్డి, రాజ్ నిడిమోరు కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
సోషల్ మీడియాలో కూడా సీక్వెల్ పై ఇప్పటికే చర్చ మొదలైంది. తొలి భాగం సాధించిన విజయాన్ని రెండో పార్టు డామినేట్ చేస్తుందా? సమంత మరోసారి బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మా ఇంటి బంగారంతో సమంత ఒక స్పెషల్ రికార్డును తన ఖాతాలో వేసుకోగా, ఇప్పుడు అదే విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత సీక్వెల్ పై పడింది. మరి అన్ని సరిగ్గా సెట్ అయితే సీక్వెల్ కూడా మరోసారి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులకు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
