Begin typing your search above and press return to search.

ఈ ముద్దుగుమ్మలు భలే లక్కీ బాసూ...!

సినిమా ఇండస్ట్రీలో విజయాలు సాధించాలి, సెలబ్రిటీలం అవ్వాలి, స్టార్స్ అవ్వాలి అనుకుని వచ్చే వారు చాలా మంది ఉంటారు.

By:  Tupaki Desk   |   16 April 2024 4:22 AM GMT
ఈ ముద్దుగుమ్మలు భలే లక్కీ బాసూ...!
X

సినిమా ఇండస్ట్రీలో విజయాలు సాధించాలి, సెలబ్రిటీలం అవ్వాలి, స్టార్స్ అవ్వాలి అనుకుని వచ్చే వారు చాలా మంది ఉంటారు. మొదటి ఆఫర్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్‌ ఉన్న వారికి మొదటి ఆఫర్‌ పెద్దగా కష్టపడకుండానే వచ్చేస్తుంది.

బ్యాక్ గ్రౌండ్‌ లేని వారు మాత్రం ఆఫర్ల కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రతిభ చూపించి ఆఫర్‌ తెచ్చుకున్నా అది హిట్‌ కాకుంటే రెండో ఆఫర్‌ విషయంలో అనుమానమే. హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా పరిచయం అవుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు.

ఒకటి రెండు సినిమాల్లో నటించి కనుమరుగు అయిన వారు చాలామంది ఉన్నారు. హిట్ పడితేనే ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పెద్దగా హిట్స్ లేకున్నా, వరుసగా సినిమా ఆఫర్లు రాకున్నా కూడా చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు.

ఫ్లాప్స్ పడ్డా కూడా మళ్లీ మళ్లీ ఆఫర్లు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలు కొందరు ఉన్నారు. వారిలో మెయిన్ గా మీనాక్షి చౌదరి, కృతి శెట్టి, రీతూ వర్మ, నభా నటేష్‌, సాక్షి వైద్య, మాళవిక నాయర్‌ మరి కొందరు ఉన్నారు. వీరు భారీ విజయాల్లో భాగస్వామ్యం అవ్వలేక పోయినా కూడా అదృష్టం కొద్ది ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్‌ లో ముందుకు సాగుతున్నారు.

ఉప్పెనతో కెరీర్‌ ను ప్రారంభించిన కృతి శెట్టి వరుసగా పరాజయాలను మూట కట్టుకుంది. అయినా కూడా తెలుగు లో యంగ్‌ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. ప్రస్తుతం శర్వా కి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది.


మీనాక్షి చౌదరి 'గుంటూరు కారం' సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది. అంతకు ముందు చేసిన సినిమాలతో పాటు గుంటూరు కారం కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. అయినా కూడా లక్కీగా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళంలో ఈ అమ్మడు పలు సినిమాలను చేస్తుంది.


సాక్షి వైద్య తెలుగు లో అఖిల్‌ మరియు వరుణ్‌ లకు జోడీగా నటించింది. ఆ రెండు సినిమాలు కూడా నిరాశ పరిచాయి. అయినా కూడా తాజాగా పవన్ సినిమాలో ఈ అమ్మడు ఎంపిక అయ్యిందని, మరో తెలుగు సినిమాలో కూడా ఈమెకు ఛాన్స్ దక్కిందనే వార్తలు వస్తున్నాయి.


నభా నటేష్ మరియు మాళవిక నాయర్ లు కూడా సక్సెస్‌ లు కొట్టి చాలా కాలం అయ్యింది. అయినా కూడా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. రీతూ వర్మ కు తెలుగు లేదా ఇతర భాషల్లో క్రమం తప్పకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.


వీరి లక్ ఇలా ఉంటే కొందరు మాత్రం ఒక్క ఫ్లాప్‌ తోనే కంటికి కనిపించకుండా కనుమరుగు అవుతున్నారు. ఫ్లాప్స్ పడ్డా మళ్లీ మళ్లీ నటించే అవకాశాలు వస్తున్నాయంటే వారు ఎంపిక చేసుకుంటున్న పాత్రలు కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ఈ ముద్దుగుమ్మలు భలే లక్కీ అని అనకుండా మాత్రం ఉండలేం.