Begin typing your search above and press return to search.

సామ్ కాంబినేషన్లో తెలుగమ్మాయికి లక్కీ ఛాన్స్

మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి యాక్టింగ్ కి ఏడాది పాటు సమంత విరామం ఇచ్చింది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 4:01 AM GMT
సామ్ కాంబినేషన్లో తెలుగమ్మాయికి లక్కీ ఛాన్స్
X

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత ఓ వైపు నటిగా సినిమాలు, వెబ్ సిరీస్ ల చేస్తూనే మరో వైపు టాలెంట్ ని ఎంకరేజ్ చేసే ఉద్దేశ్యంతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఫ్యాషన్ బిజినెస్ లో అడుగుపెట్టి సక్సెస్ అయిన సమంత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి యాక్టింగ్ కి ఏడాది పాటు సమంత విరామం ఇచ్చింది.


అయితే ఈ సమయంలో కూడా తనకి సంబందించిన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియా ద్వారా అందరికి రీచ్ అయ్యేలా చేస్తోంది. తాజాగా కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేసింది. ట్రాలాల అని పేరు కూడా పెట్టేసింది. తన ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తానని ప్రకటించింది. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ఈ నిర్మాణ సంస్థ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే సమంత ప్రొడక్షన్ హౌస్ లో మొదటి సినిమా బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్యతో చేసే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. బేబీ మూవీతో ఒక్కసారిగా తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య స్టార్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెకి అవకాశాలు క్యూ కడతాయని అనుకున్నారు. కాని అలా జరగలేదు. మళ్ళీ బేబీ దర్శకుడు నిర్మాతగా చేస్తోన్న సినిమాలో వైష్ణవికి అవకాశం ఇచ్చాడు.

తన మొదటి సినిమా హీరో ఆనంద్ దేవరకొండ ఈ మూవీలో వైష్ణవికి జోడీగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి వైష్ణవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు సమంత తన ప్రొడక్షన్ లో వైష్ణవికి అవకాశం ఇచ్చిందనే టాక్ తెరపైకి వచ్చింది.

త్వరలో ఈ మూవీపై అఫీషియల్ ఎనౌన్స్మేంట్ వస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. వైష్ణవి టాలెంట్ గురించి ఆమెతో మూవీ చేయాలని సమంత భావించింది అనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే అఫీషియల్ గా సమంత కన్ఫర్మ్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.