Begin typing your search above and press return to search.

టీజర్.. లక్కీ భాస్కర్ మ్యాటరెంటీ?

ఇక సీతారామం సినిమాతో కూడా ఇప్పుడు తెలుగులో ఒక స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   11 April 2024 12:25 PM GMT
టీజర్.. లక్కీ భాస్కర్ మ్యాటరెంటీ?
X

మలయాళం ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ గత కొంతకాలంగా తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మహానటి సినిమాలో జెమినీ గణేషన్ గా అతను కనిపించిన విధానం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక సీతారామం సినిమాతో కూడా ఇప్పుడు తెలుగులో ఒక స్పెషల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు అని చెప్పవచ్చు.

ఇక ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని ఏకంగా తెలుగు దర్శక నిర్మాతలతో అతను సినిమాలు చేసేందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు. దుల్కర్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా లక్కీ భాస్కర్ పైనే అందరి ఫోకస్ ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా తెలుగులో కూడా అతను స్థిరమైన మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు. చాలా రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్న ఈ సినిమా టీజర్ ను మేకర్స్ నేడు విడుదల చేశారు.

సీతార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చునర్ ఫోర్ శ్రీకర స్టూడియోస్ వారు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ లో హీరో క్యారెక్టర్ ను హైలెట్ చేశారు. ఒక మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగి అయిన భాస్కర్ చాలా పొదుపు చేసే వ్యక్తి అని ఒక డైలాగ్ తోనే చెప్పేశారు. ఇక అతను బ్యాంకులో రోజు డబ్బులు చూస్తూ ఉన్నప్పటికీ వాటిని అందుకోలేని పరిస్థితి.

ఇక ఊహించని విధంగా ఆ ఉద్యోగి అకౌంట్లో చాలా డబ్బు ఉంటుంది అని పాయింట్ కూడా మరింతగా హైలెట్ అయ్యింది. పైసా పైసా కూడా బెట్టుకునే లక్కీ భాస్కర్ కథ ఏంటి అనేది పూర్తిస్థాయిలో తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. మొత్తానికి ఇది మరో మిడిల్ క్లాస్ అబ్బాయి కథ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో భాస్కర్ కు ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించబోతోంది.

వింటేజ్ బ్యాక్ డ్రాప్ ఆర్ట్ వర్క్ కూడా సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రేక్షకులను 40 ఏళ్ళు వెనక్కి తీసుకు వెళ్లే విధంగా సినిమాను డిజైన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమా కంటెంట్ జనాలకు ఏ మాత్రం కనెక్ట్ అయిన కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. సినిమాలో స్టాక్ మార్కెట్ కు సంబంధించిన పాయింట్ కు ఉంటుందని టాక్.

వెంకీ అట్లూరి ఇదివరకే సార్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో మరోసారి కొత్త ప్రయోగంతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమాపై దుల్కర్ సల్మాన్ కూడా మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లక్కీ భాస్కర్ సినిమా ను జూన్లో విడుదల చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఆ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇక జీవీ ప్రకాష్ ఈ క్రేజీ కాంబినేషన్ కు సంగీతం అందిస్తున్నారు.