Begin typing your search above and press return to search.

లూసిఫర్ 2 ఎక్కడి నుండి మొదలౌతుంది ?

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో టోవినో థామస్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియ‌ర్, కీలక పాత్రల్లో నటించగా

By:  Tupaki Desk   |   21 May 2024 10:12 AM GMT
లూసిఫర్ 2 ఎక్కడి నుండి మొదలౌతుంది ?
X

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ మూవీ 2019లో కేర‌ళ‌లో బిగ్గెస్టు బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో టోవినో థామస్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియ‌ర్, కీలక పాత్రల్లో నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ క్యామియోలో కనిపించాడు. సినిమా బిగ్గెస్ట్ హిట్ తో లూసిఫర్ కు సీక్వెల్ ప్రకటించాడు పృథ్వీరాజ్ సుకుమారన్.

ఎప్పటినుంచో సీక్వెల్ వస్తున్నట్లు వార్తలు వచ్చినా తాజాగా మేకర్స్ అధికారికంగా లూసిఫర్ 2 ను ప్రకటించారు. నేడు మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా లూసిఫెర్ టీం నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసారు.

లూసిఫర్ సినిమా క్లైమాక్స్ లో మోహన్ లాల్ విదేశాల్లో ఒక మాఫియా డాన్ గా చూపించారు. తన తమ్ముడైన టోవినో థామస్ ను ముఖ్యమంత్రిని చేసి విదేశాలకు వెళ్లిన లూసిఫర్ ఎవరు ? తండ్రి లాంటి వ్యక్తి నుంచి దూరమైన వ్యక్తి లూసిఫర్ గా ఎలా ఎదిగాడు ? అనేది ఈ సీక్వెల్ లో చూయిస్తారని చెబుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మోహన్ లాల్ చుట్టు బాడీ గార్డ్స్ ఉండగా అతను నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే లూసిఫర్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం ఇంక వెల్లడించలేదు.

లూసిఫర్ మళయాళంలో భారీ హిట్ అయిన తర్వాత తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడా భారీ హిట్ కొట్టింది. ఆ తర్వాత మెగా స్టార్ చిరంజీవి ఇదే సినిమాను గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసి విడుదల చేయగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.