Begin typing your search above and press return to search.

నెం.1లో ట్రెండింగ్ అవుతున్న అక్కినేని కోడ‌లు

మొత్తానికి త‌క్కువ బ‌డ్జెట్, స‌మ‌యంలో తీసిన చీక‌టిలో సినిమాకు ఓటీటీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది.

By:  Tupaki Desk   |   28 Jan 2026 7:40 PM IST
నెం.1లో ట్రెండింగ్ అవుతున్న అక్కినేని కోడ‌లు
X

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన తెలుగు క్రైమ్ డ్రామా చీక‌టిలో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ లో ట్రెండింగ్ అవుతుంది. చీక‌టిలో ఓటీటీలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి మంచి వ్యూయ‌ర్‌షిప్ తో అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. ఈ సినిమాలోని స్టోరీ, స్క్రీన్ ప్లే గురించి ఆడియ‌న్స్ సోష‌ల్ మీడియాలో డిస్క‌ష‌న్స్ చేస్తూ త‌మ త‌మ అనుభ‌వాల్ని షేర్ చేసుకుంటున్నారు.

శోభితా న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు

ఈ మూవీలో శోభితా ధూళిపాల ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా, సినిమాలో ఆమె న‌ట‌న‌కు నెటిజ‌న్ల నుంచి మంచి ప్ర‌శంస‌లొస్తున్నాయి. ఈ మూవీలో శోభిత యాక్టింగ్, నేచుర‌ల్ డైలాగ్ డెలివ‌రీ, త‌న స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ అవ‌గా, ఆమె యాక్టింగ్, త‌న క్యారెక్ట‌ర్ సెకండాఫ్ లో క‌థ‌కు వెయిట్ ను పెంచింద‌ని భావిస్తున్నారు. అయితే ఈ విష‌యంలో కొంద‌రు మాత్రం సినిమా మొత్తాన్ని శోభితా యాక్టింగ్ పైనే ఆధార‌పడేలా చేశార‌ని కామెంట్స్ చేస్తున్నారు.

త‌క్కువ బ‌డ్జెట్ లోనే..

మొత్తానికి త‌క్కువ బ‌డ్జెట్, స‌మ‌యంలో తీసిన చీక‌టిలో సినిమాకు ఓటీటీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. సినిమా చిన్న స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ, ఓటీటీ ఆడియ‌న్స్ కు మంచి ఇంట్రెస్ట్ ను క‌లిగిస్తుంద‌ని, దానికి తోడు సినిమాకు మంచి మౌత్ టాక్ ల‌భించ‌డం కూడా ప్ల‌స్సైంది. క‌థ ప‌రంగా చెప్పుకుంటే సినిమా కాస్త నెమ్మ‌దిగా అనిపించిన‌ప్ప‌టికీ చీక‌టిలో మూవీకి మంచి రెస్పాన్సే వ‌స్తుంది.

ఓవ‌రాల్ గా చీక‌టిలో మూవీకి నెటిజ‌న్ల నుంచి కొన్ని విష‌యాల్లో ప్ర‌శంస‌లతో పాటూ, మ‌రికొన్ని విష‌యాల్లో విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. టెక్నిక‌ల్ గా కూడా ఈ సినిమా రిచ్ గానే ఉంది. సౌండ్ డిజైన్ నుంచి సినిమాటోగ్ర‌ఫీ వ‌ర‌కు సినిమా రియ‌లిస్టిక్ గా ఉండేలా చేయ‌గ‌లిగాయి. మొత్తానికి కంటెంటె ఓరియెంటెడ్ సినిమాల‌ను మెచ్చే ఓటీటీ ఆడియ‌న్స్ కు చీక‌టిలో సినిమా ఒక మంచి ఆప్ష‌న్ గా నిలిచింది.